
ఈ సినిమాపై ఉన్న హైప్‌కి తగ్గ పాన్ ఇండియా రిలీజ్ స్ట్రాటజీ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశతో ఉన్నారు. మొదటి నుంచే మేకర్స్ తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పినా, ఇప్పటివరకు పోస్టర్లు, ట్రైలర్ అప్డేట్స్‌లో భాషల ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా తెలుగు వెర్షన్‌కే పరిమితం అవుతుండడంతో నిరాశతో ఉన్నారు. కానీ లేటెస్ట్‌గా హిందీ ట్రైలర్ రిలీజ్ కావడంతో, హిందీలో కూడా ఈ సినిమా రాబోతుందనేది కన్ఫర్మ్ అయింది. దీనితో బాలీవుడ్ మార్కెట్‌లో కూడా పవన్ కళ్యాణ్ పవర్‌ను టెస్ట్ చేయబోతున్నారు. అయితే తమిళ్ లేదా మలయాళం వంటి ఇతర భాషలపై మాత్రం ఇంకా అధికారిక క్లారిటీ ఇవ్వలేదు. ఆ భాషలలో కూడా తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ చేసి ఉంటే ఓపెనింగ్స్ మరింత గట్టిగా ఉండేవని లెక్కలు వేస్తున్నారు.
ఫైనల్‌గా ‘ఓజి’ తెలుగు రాష్ట్రాల్లో పవర్‌ఫుల్ ఓపెనింగ్స్ సాధించడం ఖాయం. హిందీ వెర్షన్‌తో పాన్ ఇండియా బజ్ కూడా మొదలవుతుందని ట్రేడ్ టాక్. ఇక మిగతా భాషల విషయమై మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు సస్పెన్స్ కొనసాగుతుంది. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఈ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం ఖాయం.