టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అది ఆడియో ఫంక్షన్స్ , లేదా ఇతర ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా కూడా చాలామంది పవన్ కళ్యాణ్ ని పొగిడేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కి  అభిమానిగా మారి కొంతమంది డైరెక్టర్లు పవన్ కళ్యాణ్ తో సినిమాలను తెరకెక్కించి భారీ విజయాలను అందించగలిగిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు.. అలాంటి డైరెక్టర్లలో హరి శంకర్ కూడా ఒకరు.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనను ఎలా చూడాలనుకున్నారో అలా చూపించిన చిత్రమే గబ్బర్ సింగ్.


డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని పవన్ కళ్యాణ్ తో మిరపకాయ సినిమా చేయవలసి ఉండగా కుదరకపోవడంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పిలిచి మరి గబ్బర్ సింగ్ సినిమా అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ కూడా అసలు సగటు అభిమానిగా పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలో అలా చూపించారు. పవన్ కళ్యాణ్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా క్యాప్ పెట్టుకోరు. హెయిర్ స్టైల్ నే స్టైలిష్ గా వాడారు. సినిమా షూటింగ్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు హరీష్ శంకర్. ఇక వాటి ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే.



అయితే ఇప్పుడు డైరెక్టర్ సుజిత్ కూడా అలాగే ఓజి సినిమాతో ఆఫ్టర్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనని ఇలా చూస్తున్నామని థియేటర్లో రచ్చ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ అంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ ఇప్పుడు ఒకడు వచ్చాడు ఊచకోత అంటే ఏమిటో చూపించారు.. ఒక్కో షాట్ ఎంతో అద్భుతంగా ఉంది.. ఒక్కొక్కరిని నరుకుతుంటే భయమేస్తోంది చూసేవాడికి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత పదేళ్లపాటు మాట్లాడుకున్నారు!ఇప్పుడు ఓజి గురించి కూడా మరో పదేళ్లు మాట్లాడతారు అంటూ  చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: