
వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి ఎప్పుడూ కూడా ఇలాంటి విషయాల పైన స్పందించలేదు.. బాలయ్య కుటుంబం వేధింపులకు గురై, జైలు పాలు అయినప్పుడు కూడా అండగా ఉంది మెగా కుటుంబమే. ఈ విషయాన్ని ఆయన మర్చిపోయారెమో!ఆయన కుటుంబం వల్లే ఇప్పుడు అధికారంలోకి మీరు రావడానికి కారణమయ్యింది. వాటికోసం ఎంతో కృషి చేసిన మెగా కుటుంబం పైన విజ్ఞతను మరిచి చట్టసభలలో సైతం చిరంజీవి ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడడం బాధాకరంగా ఉందంటూ తెలియజేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు తమనే కాదు తమ అభిమాన హీరో చిరంజీవిని కూడా బాధించాయని అందుకు ప్రతిస్పందన ద్వారా అందరికీ అర్థమయ్యిందంటూ తెలిపారు.
ఒకవేళ ఆరోజు మెగా కుటుంబం అండగా నిలబడకపోయుంటే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది అంటూ తెలియజేస్తున్నారు. ఇప్పుడు బహిరంగ క్షమాపణలు తెలిపాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడితే మాత్రం మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. బాలయ్య క్షమాపణ చెప్పకపోతే ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవలసి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు చిరంజీవి అఖిల భారత యువత సంఘం. మరి ఈ విషయం పైన నందమూరి బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది.