భారతీయులు సైతం దేవాలయాలకు వెళ్లిన లేకపోతే ఇంట్లో పూజ గదిలో, కొన్ని సందర్భాలలో ఎక్కువగా అగరబత్తీలను వెలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా నవరాత్రులలో ప్రతిరోజు కూడా అగరబత్తల సువాసనఇంటి నిండ ఉంటుంది. అయితే ఈ పవిత్రమైనటువంటి పొగ మనుషుల ఆరోగ్యాన్ని హానికరం చేసేలా ఉంటుందని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. ఆస్తమా, క్షయ, COPD వంటి వ్యాధులతో ఇబ్బంది పడే వారికి ఈ పొగను పీల్చడం వల్ల చాలా ప్రమాదం ఉంటుందని చైనా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు తెలుపుతున్నారు.


అగర్బత్తిలో PM 2.5 , కార్బన్ మోనాక్సైడ్ ఇతర వాయువులు. ఇవి ఇంట్లో ఉండే గాలిని కూడా కలుషితం చేస్తాయని.. వాటిని పీల్చినప్పుడు ఊపిరితిత్తులను దెబ్బతినేలా చేస్తాయి. అగర్బత్తి పొగలో వచ్చే సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులలోకి చొచ్చుకుపోయి గుండె జబ్బులు, క్యాన్సర్  వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయట.



 అగర్బత్తి నుంచి కార్బన్ మోనాక్సైడ్ విడుదల చేస్తుంది.. దీనిని పీల్చినప్పుడు మన రక్తంలో కలిసిపోయి ఆక్సిజన్ స్థాయిని తగ్గించి తీవ్రమైన తలనొప్పి వచ్చేలా చేస్తుంది.  అందుకే పిల్లలు, వృద్దులు ఎవరూ కూడా అగరబత్తి పొగకు దగ్గరగా ఉండకూడదు.


అలాగే ఆస్తమా ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు, స్కిన్ అలర్జీలు, దీర్ఘకాలిక దగ్గు ఉన్నవారు ఈ అగర్బత్తి పొగకు  దూరంగా ఉండడం మంచిది. ఈ అగర్బత్తి పొగ సిగరెట్ పొగలాగే ఊపిరితిత్తుల వాపు, శ్వాసనాలలకు చికాకు కలిగించేలా చేస్తుంది.


ప్రతిరోజు అగరబత్తీ పొగ పొగపీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. వీటిని ఎక్కువ కాలం పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అగరబత్తిలను వెలిగించేటప్పుడు.. కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం మంచిది.. లేకపోతే  గాలి బాగా వీచే ప్రాంతాలలో వెలిగించడం మంచిది. కిటికీలు లేని గదిలో వెలిగించడం వల్ల చాలా ప్రమాదం.


నాణ్యమైన సహజ పదార్థాలతో తయారుచేసిన అగరబత్తులను తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: