
కిరణ్ అబ్బవరం తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ –“ప్రదీప్ రంగనాథన్ ఒక తమిళ నటుడు. కానీ ఆయన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్నప్పుడు మంచి థియేటర్లు దొరుకుతున్నాయి. కానీ నేను నా సినిమాని తమిళనాడులో రిలీజ్ చేయాలంటే మాత్రం వాళ్లు స్పష్టంగా చెబుతారు – థియేటర్లు లేవు అని. ఇది ఎక్కడి న్యాయం..? అని ఆవేదన వ్యక్తం చేశారు. దీని పై ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. మనం వాళ్ల సినిమాలకు మన రాష్ట్రాల్లో థియేటర్లు ఇస్తుంటే, వాళ్లు మన సినిమాలకు ఎందుకు ఇవ్వరు?”
ఈ వ్యాఖ్యలు కిరణ్ అబ్బవరం అభిమానులతో పాటు అనేకమంది ప్రేక్షకుల్లో చర్చకు దారి తీశాయి. చాలామంది సోషల్ మీడియాలో ఆయన మాటలకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు.“ఇది కేవలం కిరణ్ అబ్బవరం ఒక్కరి సమస్య కాదు, ఇంకా చాలా మంది బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి ఇది” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కొంతమంది సినీ ప్రేమికులు మాత్రం – “ఇది మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. తమిళనాట మార్కెట్ లేకపోతే థియేటర్లు ఇవ్వరు, అలాగే తెలుగులో మార్కెట్ ఉన్న తమిళ హీరోలకు ఇక్కడ ధియేటర్లు దొరుకుతాయి” అని వాదిస్తున్నారు.
ఏదేమైనా, కిరణ్ అబ్బవరం చెప్పిన మాటలు ఒక చేదు నిజాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా, బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదగడం ఎంత కష్టం అనేది ఇలాంటి సంఘటనల ద్వారానే స్పష్టమవుతుంది. సొంత ప్రతిభతో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న యువ హీరోలకు ఇది ఒక పెద్ద మద్దతు లాంటిది. అభిమానులు మాత్రం – “కిరణ్ లాంటి నిజాయితీ గల నటులు ఇండస్ట్రీలో ఇంకా ఉండటం మన అదృష్టం” అని అంటున్నారు..!!