మెగాస్టార్ చిరంజీవిఅనిల్ రావిపూడి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఉన్న ఎక్సైట్మెంట్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఫస్ట్ సింగిల్‌తో మాస్ ఫ్యాన్స్‌లో హల్చల్ చేస్తోంది. “మీసాల పిల్ల” అనే ఈ పాట ప్రోమో ఇప్పటికే వైరల్‌గా మారగా, ఇప్పుడు పూర్తి లిరికల్ వీడియో కూడా రిలీజ్ అయింది. భార్యాభర్తల మధ్య వచ్చే అలక, అల్లరి, బుగ్గల మీద ముద్దులు – ఈ సాంగ్‌ అంతా ఆ ఫ్యామిలీ ఎమోషన్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. “మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి పిల్లా…” అంటూ భాస్కరభట్ల రాసిన లిరిక్స్ హస్బెండ్–వైఫ్ మధ్య వచ్చే ఆ సరదా గొడవలను చాలా హాయిగా చెబుతున్నాయి.

ఉదిత్ నారాయణ్ స్వరంలో పాటకు ఓ వింటేజ్ రొమాంటిక్ ఫీల్ వచ్చింది. చిరంజీవి స్టైల్లో ఉన్న స్మార్ట్ డ్యాన్స్ మూవ్స్ మాస్ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకుంటున్నాయి. ఓ లాంగ్ టైమ్ తర్వాత చిరు రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ట్రాక్‌లో కనిపించడం ఫ్యాన్స్‌కి ట్రీట్‌గా మారింది. ఈ పాటలో నయనతారచిరంజీవి కెమిస్ట్రీ చాలా న్యాచురల్‌గా, క్లాస్ అండ్ మాస్ కలయికగా కనెక్ట్ అవుతోంది. ప్రత్యేకంగా కొన్ని స్టెప్స్ చూస్తే పక్కా “వింటేజ్ చిరంజీవి” గుర్తు వస్తాడు. స్మార్ట్ ఎక్స్ప్రెషన్స్, టైమింగ్ డ్యాన్స్, పక్కా బాడీ లాంగ్వేజ్ – ఇవన్నీ కలిసి సాంగ్‌ని సూపర్ హిట్ రేంజ్‌లోకి తీసుకెళ్లాయి. భార్యభర్తల అలక అనే యూనివర్శల్ ఎమోషన్‌ని అనిల్ రావిపూడి చక్కగా క్యాప్చర్ చేశాడని చెప్పాలి.

మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఈ సాంగ్ కంపోజ్ చేయబడింది. సంక్రాంతి సీజన్‌లో ఇలాంటి ఫ్యామిలీ వైబ్ ఉండటం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. “సరైర ట్రాక్‌లోనే సినిమా రెడీ చేస్తున్నాడని ఈ సాంగ్ చూస్తేనే అర్థమవుతోంది” అనే కామెంట్స్ సోషల్ మీడియాలో ఊపందుకుంటున్నాయి.మ్యూజిక్ మెలోడీగా, లిరిక్స్ సరదాగా, విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉండటంతో “మీసాల పిల్ల” సాంగ్ పక్కా చార్ట్ బస్టర్‌గా మారేలా కనిపిస్తోంది. ఈ సాంగ్‌తో సినిమా మీద క్రేజ్ మరింత రెట్టింపైంది. చిరు ఫ్యాన్స్‌కి ఇది ఎమోషనల్ ఫ్యామిలీ టచ్‌తో కూడిన మాస్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఇకపోతే మిగతా సాంగ్స్, ట్రైలర్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ స్టైలిష్ లుక్, అనిల్ రావిపూడి ఎంటర్‌టైనింగ్ టచ్ – ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ దుమ్ము రేపేలా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: