తెలుగు లో ఇప్పుడు భారీ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్స్ కూడా అంతే భయంకరంగా ఉంటున్నాయి. ఈ మద్య
సుజిత్ దర్శకత్వంలో
ప్రభాస్ నటించిన ‘సాహెూ’ దాదాపు రూ.350 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. ఈ మూవీ రిలీజ్ కి ముందు తెలుగు, మళియాళ,కన్నడ, హిందీ భాషల్లో వీరలెవెల్లో హైప్ తీసుకు వచ్చారు. ఈ మూవీ మరో బాహుబలి ని కాబోతుందని నానా హంగామా చేశారు. కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత దారుణమైన ఫలితాన్ని చవిచూసింది.
ఒక్క బాలీవుడ్ లో తప్ప మూడు భాషల్లో తేలిపోయింది. అంతే కాదు ఏలాంటి నష్టాలు రావని భావించిన ‘సాహెూ’ కొన్ని చోట్ల భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు భారీ బడ్జెట్ తో మెగాస్టార్
చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ రిలీజ్ కి సిద్దంగా ఉంది. అయితే ఇదే సమయంంలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న ‘వార్’ మూవీ రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ మూవీ తెలుగు లో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు
హృతిక్ రోషన్ నటించిన క్రిష్,క్రిష్ 2 కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు లో కూడా హృతిక్ కి మంచి అభిమానులు ఉన్నారు. టైగర్ ష్రాఫ్ డ్యాస్, ఫైట్స్ తో యూట్యూబ్ లో సంచలనాలు రేపిన విషయం తెలిసిందే.
ఇప్పుడు బాలీవుడ్ లో
సైరా మూవీ ‘వార్’ తో ఢీ కొట్టబోతుంది. ఇప్పటికే బాలీవుడ్ లో కూడా ప్రమోషన్లో చేస్తూ వచ్చిన
సైరా మరి ఎంత వరకు వార్ ని ఢీ కొట్టి నిలబడగలదు..ఈ రెండు మూవీస్ లో ఏది ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా..మరో మూవీ భారీ కలెక్షన్లు సాధించగలదు. మరి మెగాస్టార్ క్రేజ్ బాలీవుడ్ లో ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.