బ్రిటన్ లో ఉంటున్న భారత సంతతికి చెందిన ఎన్నారై అక్కడి ఓ ప్రముఖ సూపర్ మార్కెట్ పై కేసు వేశాడు. తన కిడ్నీలో రాళ్ళు కదిలిపోయాయి. అందుకు గాను నాకు 65 లక్షల నష్టపరిహారాన్ని ఇప్పించండి అంటూ కోర్టులో వేసిన దావా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కిడ్నీలో రాళ్ళు కదలడం ఏమిటి. నష్టపరిహారం కోసం కోర్టుని ఆశ్రయించడం ఏమిటి అంటూ అందరూ నవ్వుకున్నారు. అయితే ఆ కేసు అతడు ఎందుకు వేశాడనే విషయాన్నీ స్థానిక మీడియా తెలిపింది.

 

లాలు హనుమాన్ అనే భారత సంతతి వ్యక్తి బ్రిటన్ ఓ ప్రముఖ లాయర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో ఏళ్ళ క్రితమే బ్రిటన్ లో స్థిరపడ్డాడు. అక్కడే ఉన్న ఓ ప్రముఖ సూపర్ మార్కెట్ “టేస్కో” వెళ్ళిన హనుమాన్ ఓ చాక్లెట్ కొనుగులు చేశాడు. కొనుగులు చేసినందుకు డబ్బులు చెల్లించి బిల్లు చెత్త బుట్టలో వేశాడు. బయటకి వచ్చే క్రమంలో అక్కడి సెక్యూరిటీ గార్డ్ హనుమాన్ ని అడ్డగించాడు..

 

చాక్లెట్ కి బిల్లు చూపించమని అడుగగా, అది చెత్త బుట్టలో వేశాను, బిల్లు లేదని చెప్పడంతో ఆ సెక్యూరిటీ గార్డ్ తనపై దురుసుగా ప్రవర్తించాడని, చేయి పట్టుకుని అతివేగంగా షాపులోపలికి తీసుకువెళ్ళాడని దాంతో నా కిడ్నీ లో ఉన్న రాళ్ళు కదిలాయని, ఈ క్రమంలో నేను తీవ్ర మానసిక వేదన, శారీరక బాధని అనుభవించానని ఆవేదన వ్యక్తం చేస్తూ తనకి నష్టపరిహారంగా సదరు కంపెనీ రూ. 65 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: