సాధారణంగా సినిమాల్లో ఒక కుటుంబం తమ పిల్లల నుంచి ఏదో ఒక రహస్యం దాచటం, దానిని చివరిలో రివీల్ చేయడమనేది మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి రహస్యాలు సినిమాల్లోనే కాదు. నిజ జీవితంలో కూడా ఉంటుంటాయి. ఇంగ్లాండ్ దేశంలో నివసిస్తున్న ఒక మహిళ ఇలాంటి సీక్రెట్ వల్లే తన జన్మకు కారణమైన తండ్రి తన తల్లి మొదటి భర్త అని మొన్నటిదాకా భావించింది. అతడే తన తండ్రి అనుకొని, అతను బతికి ఉంటే ఎంత బాగుండోనని ఎప్పుడూ కలలు కన్నది. తన లాగానే తన తండ్రికి కూడా లక్షణాలు ఉండేవా అనుకుంటూ కాలం గడిపింది. అతనితో అనుబంధం ఎలా ఉండేదో అని పగటి కలలలో విహరించింది.

36 ఏళ్లుగా ఆమె తన తండ్రి క్యాన్సర్ తో చనిపోయాడనే భావనతోనే లైఫ్ కొనసాగించింది. ఈ క్రమంలోనే ఆమెకు తన తండ్రి తాను అనుకున్న వ్యక్తి కాదనే సంగతి తెలిసింది. ఇంతకీ ఈమె పేరు ఏంటంటే పేరు టిఫినీ గార్డ్‌నర్. 1982లో ఒక అజ్ఞాత వ్యక్తి వేరే దానం చేయగా టిఫినీ తన తల్లికి పుట్టింది. అయినా ఈ విషయాన్ని తల్లి తన మొదటి భర్తతో కలిసి సీక్రెట్ గా ఉంచింది. టిఫినీ తన మొదటి భర్తకు పుట్టిన అమ్మాయేనని తల్లి అందరికీ చెప్పేది. టిఫినీ కూడా అదే విషయాన్ని నమ్మింది. ఆమె మొదటి భర్త క్యాన్సర్ వల్ల చనిపోయాడు. ఆ సమయంలో టిఫినీకి నాలుగేళ్ల వయసు ఉంది. కొంచెం పెద్ద అయిన తర్వాత ఆమె తల్లి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దాంతో టిఫినీ తన తల్లి మొదటి భర్త అయిన తన తండ్రి చనిపోయాడు అనుకుంటూ చాలా రోజుల సమయం గడిపేది.

అయితే టిఫినీ 36వ పుట్టినరోజు సందర్భంగా కిచెన్‌లో తల్లి మాట్లాడుతూ.. "నీకు అసలైన తండ్రి నా మొదటి భర్త కాద"ని తెలిపింది. ఈ మాటలు వినగానే టిఫినీకి షాక్ తగిలినంత పని అయింది. ఎవరో ఒక అజ్ఞాత స్పెర్మ్ డోనర్ దానం చేసిన వీర్యం వల్ల టిఫినీ పుట్టిందని ఆమె తెలిపింది. తన నాయనమ్మకు ఈ సంగతి తెలిస్తే రిలేషన్షిప్ పాడౌతుందనే ఉద్దేశంతో తన తల్లి తన పుట్టిక గురించి దాచి పెట్టిందని టిఫినీ తెలిపింది. అయినా చిన్నప్పుడే ఈ విషయం తనకు చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడింది. అలాగే తనకి బయలాజికల్ గా లైఫ్ ఇచ్చిన తండ్రికి పుట్టిన మరో వ్యక్తిని ఆమె కనుగొంది. అతడు తనకు సోదరుడు అవుతాడని తెలిపింది. డిఎన్ఏ మ్యాచింగ్ సైట్ ద్వారా ఆమె తన తండ్రికి పుట్టిన ఆ వ్యక్తిని కనుగొన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri