అమెరికా వెళ్తున్నారా అయితే అన్ని పనులు సక్రమంగా చేసుకోవడమే కాదు. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన జవాబులు కూడా ఇవ్వాలి? ఏ మాత్రం తడబడిన ఇక వెనక్కి వెళ్లిపోవడం ఖాయం. ఈ మధ్య అమెరికా వెళ్లిన 21 మంది స్టూడెంట్లను చికాగో, శాన్ ప్రాన్సిస్కో లాంటి ఎయిర్ పోర్టుల నుంచి తిరిగి వెనక్కి పంపించారు.


దీనికి కారణం వారు అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు తడబడటం, సరైన సమాధానాలు చెప్పకపోవడం. అయితే అప్పటికే అక్కడ యూనివర్సీటీల్లో సీటు పొంది.. అఫీషీయల్ గా వీసా కూడా తీసుకుని వెళ్లిన ఎందుకు వెనక్కి పంపారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే అక్కడే నివాసముండే కొంత మంది భారతీయులు మాట్లాడుతూ.. వీసా ప్రాసెస్ అంతా పూర్తయినా కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు చివరి నిమిషంలో వెరిఫికేషన్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టూడెంట్లు జాగ్రత్త పడాలని చెబుతున్నారు.


స్టూడెంట్లను అక్కడి పోలీసులు అమెరికా ఎందుకు వస్తున్నారు. ఏం చేస్తారు. ఎన్ని రోజులు ఉంటారు. స్టడీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు. చదువుకునే సమయంలో ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తారా? మరేదైనా పని చేస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. అదీ కాకుండా మీ మొబైల్ ఫోన్ కూడా చెక్ చేస్తారు. అమెరికా వచ్చే ముందు ఎవరితోనైనా చాటింగ్ చేస్తే దాన్ని పరిశీలిస్తారు. స్టూడెంట్ వీసా మీద వచ్చిన వారు ఎక్కడైనా పని దొరుకుతుందా అనే విషయాలు చర్చిస్తే కూడా వెనక్కి పంపిస్తారు.


మరీ ఇలాంటి సమయంలో చాలా కష్టమని తెలుసుకోవాలి. కాబట్టి అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, ఎక్కడా కూడా తప్పిదం జరగకుండా చూసుకోవాలని అమెరికాలో ఉండే భారతీయులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దేశం నుంచి అమెరికాా వెళ్లే 40 శాతం మంది తెలుగు వారే ఉండటంతో ఈ ఆందోళన ఎక్కువైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

NRI