ఈ ప్రపంచం ఎంతగా అర్ధం చేసుకున్న అర్ధంకాని ఓ మహాసముద్రం.ఇందులో ఎన్నో రహస్యాలు నిగూఢంగా దాగి వున్నాయి. వీటిని చేధించాలని ఎందరో ప్రయత్నించారు. ఇప్పటికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.కొందరైతే ప్రాణాలు కూడ పోగొట్టుకున్నారు. సైన్స్ విసిరే సవాల్‌ను ఎదుర్కోవాలని మానవుడు పడుతున్న తాపత్రయం అంతాయింతా కాదు.కాని ఈ సైన్స్ మానవుడు కనుగొనడానికి ముందే పురణాల్లో చెప్పబడిందట.అందుకు ఉదాహరణగా వినాయకుని ఉదంతాన్ని చెబుతారు.అదేమంటే ‘వినాయకుడి తలను కోపంతో ఖండించిన శివుడు ఆపై చింతించి,ఓ ఏనుగు తలను తెప్పించి వినాయకుడికి అతికించి అతణ్ని బతికించాడని మరి ఇది ఈ కాలంలో సాధ్యమా అంటే అసాధ్యం అంటారు.కాని సాధ్యమని నిరూపించారు.ఇటలీకి చెందిన సర్జన్ ఫ్రాంకేన్‌స్టేయిన్.ఇతను సెర్జియో కానావెరో సహకారంతో ఈ సర్జరీ నిర్వహించాడు..ఇక వివరాల్లోకి వెళ్లితే..



రష్యాకు చెందిన వ్యాలరీ స్పిరిడినోవ్‌ అనే వ్యక్తి,ఏడాది వయస్సు నుంచీ హాఫ్‌మన్ డిసీజ్‌ అనే అరుదైన నాడీ కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నాడు.ఈ వ్యాధి గ్రస్థుల్లో వెన్నెముకలో,మెదడుతో కలిసే చోటా మోటర్‌ న్యూరాన్స్‌ దెబ్బతిని పోతాయి.ఈ వ్యాధి వల్ల వ్యాలరీ ఇతరుల సాయం లేకుండా నడవలేని,కూర్చోలేని స్థితికి చేరుకున్నాడు.వీల్‌చైర్‌కే పరిమిత మయ్యాడు.నానాటికీ పరిస్థితి దిగజారుతోంది.30 ఏళ్లకే అతడికి జీవితమంటే విరక్తి కలిగింది.ఈ స్థితిలో ఇటలీకి చెందిన న్యూరో సర్జన్‌ డాక్టర్‌ సెర్జియో కెనవెరో గురించి వ్యాలరీకి తెలిసింది.ఒకరి తలను ఒకరికి మార్పిడి చేసే శస్త్రచికిత్సపై డాక్టర్‌ సెర్జియో ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నారు.ఇలాంటి శస్త్ర చికిత్సకు తాను సిద్ధమని,తన తలకు వేరే శరీరాన్ని అమర్చి తనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని అతడు డాక్టర్‌ సెర్జియోను కోరాడు.ఈ ఆపరేషన్‌లో ఉండే రిస్కు గురించి తనకు తెలుసని,చావుకైనా సిద్ధపడే ముందుకొచ్చానని తెలిపాడు.



ఇంకేముంది ప్రయత్నానికి రంగం సిద్దమైంది.ఇటలీకి చెందిన సర్జన్ ఫ్రాంకేన్‌స్టేయిన్ సహకారంతో ఈ సర్జరీ నిర్వహించారు. దీనికి పెట్టిన పేరు ఏంటంటే హెడ్ అనాస్తోమోసిస్ వెంచర్ అని ఇక ఈ ఆపరేషన్ ఖర్చు ఎంతంటే 122కోట్లట.36 గంటలు సమయం.చెప్పలేనంత మంది స్టాఫ్ వీరందరితో ఈ సర్జరీ విజయవంతంగా ముగించారట.ఇక సైన్స్ చరిత్రలో మరో కొత్త అధ్యాయనానికి తెరలేపినారని అందరు అనుకుంటున్నారు..ఇక త‌ల‌మార్పిడి జరిగిన త‌రువాత నాలుగువారాలపాటు పేషెంట్ కోమాలోనే ఉంటాడని వైద్యులు పేర్కొన్నారు.ఎందుకంటే మెడకు,దేహానికి మధ్య గాయం ఉంటుంద‌ని,అది మానేంత వరకు పేషెంట్‌ కోమాలోనే ఉంటాడ‌ని చెప్పారు.త‌ల‌మార్పిడి చేయించు కున్నాక వ్యాలరీ అంద‌రిలాగే మాట్లాడతాడ‌ని,న‌డుస్తాడ‌ని వైద్యులు తెలిపారు.డాక్టర్స్ చెప్పినట్లుగానే వ్యాలరీ స్పిరిడినోవ్‌ కొంతకాలానికి కోలుకొని పూర్తిగా ఆరోగ్యవంతుడై మ్యారేజ్ చేసుకుని చాల సంతోషంగా ఉన్నాడట.తనకు మరోజీవితాన్ని ప్రసాధించిన డాక్టర్స్‌కు రోజు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మెసెజెస్ కూడా పంపిస్తాడట...

మరింత సమాచారం తెలుసుకోండి: