
నిర్భయ కేసులోని నలుగురి నిందితుల క్షమాభిక్షను సుప్రీం కోర్టు తిరస్కరించిందన్న విషయం తెలిసిందే. అయితే, ఈ నెల 7వ తారీఖున ఈ నీచుల డెత్ వారెంట్ల పై తీర్పునివ్వనుంది ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు. నిర్భయ దోషులైన పవన్, ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌లకు ఈ కోర్టు తీర్పునివ్వగానే.. వెంటనే ఉరి తీస్తారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
https://mobile.twitter.com/thefirstindia/status/1212365032115191811
ఎందుకు ఆ వార్తలు వస్తున్నాయంటే... తీహార్ జైల్లో ఇప్పటికే 3 కొత్త ఉరికంబాలను, 3 సొరంగాలను ఏర్పాటు చేసారు. అయితే, ఇంతకుముందు ఉన్నటువంటి ఉరికంభం పక్కనే ఈ మూడు ఉరికంబాలను PWD డిపార్ట్మెంట్ నిర్మించారు. నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీస్తే.. తీహార్ జైలు చరిత్రకెక్కిది. ఎందుకంటే ఇద్దరి కంటే ఎక్కవ దోషులను ఒకేసమయంలో ఉరితీయలేదు మన దేశం. గతంలో ఎప్పుడో అనగా జనవరి 31న 1982వ సంవత్సరంలో బిల్లా, రంగా అనే ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులను తీహార్ జైల్లో ఒకే సమయంలో ఉరి తీశారు. వీళ్లిద్దరు లిఫ్ట్ అడిగిన 14 ఏళ్ల సంజయ్ చోప్రాను, 16 ఏళ్ల గీతా చోప్రాని కారులో ఎక్కించుకొని గీతాను రేప్ చేసి.. ఆపై అక్కాతమ్ముడిని చంపేశారు.
మళ్ళీ అటువంటి కరుడుగట్టిన నిర్భయ దోషులను ఒకే సమయంలో ఉరితీస్తున్నారన్న వార్త ఆసక్తిని రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన నలుగురు తలారులు నిందితులను ఉరితీయడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. నిందితుల బరువుల ఆధారంగా ఎన్ని అడుగుల ఎత్తులో ఉరి తీయాలో అధికారులు చెబుతారు. ఎక్కువ బరువుంటే తక్కువ ఎత్తు.. తక్కువ బరువుంటే ఎక్కువ ఎత్తు. ఈ విధంగా చేయకపోతే.. దోషి మెడ వరకు తెగి మిగతా శరీరం కిందపడుతుందని అధికారులు చెబుతారు. ఉరిశిక్ష అమలు చేసిన తరువాత, దోషి లో ఏ స్పందన లేని 15నిమిషాల తరువాత ఒక డాక్టర్ నిచ్చనెక్కి దోషి బ్రతికున్నాడో లేదో చూసి చెబుతారు. ఏదేమైనా ఉరి శిక్ష ఎన్ కౌంటర్ కంటే ఘోరంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడతారు.
ఒక ఉరి వీడియో ప్రత్యేకంగా మీకోసం..!
https://mobile.twitter.com/IranHrm/status/1040707915399749634
https://mobile.twitter.com/yoavlevys/status/944246341202534400