ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ కి  చంద్రబాబునాయుడుకి తేడా ఏమీ లేదని మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. కరోనా వైరస్ కన్నా మందు కనిపెడతారేమో కానీ ఎల్లో వైరస్ కు మాత్రం మందు కనిపెట్టటం కష్టమంటూ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ గుడివాడలో ఓ వృద్ధురాలు మరణిస్తే నిత్యావసరాలు తీసుకోవటానికి వెళ్ళి చనిపోయింది కాబట్టి తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేయటంపై కొడాలి ఫుల్లుగా ఫైర్ అయ్యాడు.

 

ఎవరో పెద్దావడ అనారోగ్యంతో మరణిస్తే తాను రాజీనామా చేయాలని టిడిపి నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేయటమేంటో తనకు అర్ధం కాలేదన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే టిడిపి నేతలు తనపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నట్లు మండిపోయారు. అసలు గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్ధపైనే నోటికొచ్చినట్లు మాట్లాడిన ఇదే నేతలు ఇపుడు వాలంటీర్లతో బియ్యం పంపిణీ చేయించాలని డిమాండ్ చేయటాన్ని తప్పుపట్టారు. ఇంటింటికి తిరిగి వాలంటీర్లు బియ్యం పంపిణీ చేయటానికి వాళ్ళేమీ ఖాళీగా లేరన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

 

కరోనా వైరస్ బాధితులను గుర్తించటంలోను, ఇంటింటి సర్వే విషయంలో వాలంటీర్లు బిజీగా ఉంటే వాళ్ళ గురించి ఎల్లో నేతలు మాట్లాడటం ఏమిటంటూ ఫైర్ అయ్యాడు. మొత్తం మీద కొడాలి తన ప్రెస్ మీట్లో చంద్రబాబునే ఫుల్లుగా టార్గెట్ చేశాడు. 70 ఏళ్ళు వయస్సులో కరోనా వైరస్ దెబ్బకు భయపడి భార్య, బిడ్డలతో ఏపి నుండి హైదరాబాద్ లోని గ్లాస్ హౌస్ లో కూర్చుని రాజకీయాలు చేయటంపై సూటిగా ప్రశ్నించారు.

 

కరోనా వైరస్ దెబ్బకు దేశమంతా ఇబ్బందులు పడుతుంటే తన వయస్సుకు లేకపోతే అనుభవానికి తగ్గట్లుగా చంద్రబాబు సూచనలో లేకపోతే సలహాలో ఇవ్వాలి కానీ ఇపుడు కూడా చవకబారు రాజకీయాలు చేయటం తగదన్నారు. పెద్దావిడ అనారోగ్యంతో చనిపోతే ఆవిడ మరణంపైన కూడా ఎల్లోమీడియాలో తప్పుడు ప్రచారం చేయటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తానికి చాలా కాలం తర్వాత మీడియా ముందుకొచ్చిన కొడాలి చంద్రబాబు, టిడిపి నేతలపై ఫుల్లుగానే ఫైర్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: