భూకంపాలు నేపాల్ దేశాన్ని ప‌గ‌బ‌ట్టిన‌ట్లు ఉన్నాయి. గతంలో అనేక మార్లు భూకంపాలు చోటు చేసుకున్నాయి ఈ దేశంలో. తాజాగా బుధ‌వారం తెల్ల‌వారు జామున నేపాల్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది.  నేపాల్ రాజధాని ఖంట్మండులో భూమి కంపించింది.  తూర్పు ఖాట్మండులోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.  రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.4 గా నమోదైంది.  అయితే, ఆస్తి, ప్రాణ నష్టం గురించిన వివరాలు అందాల్సి ఉన్నది.  తూర్పు ఖాట్మండుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్ చే కేంద్రంగా భూకంపం సంభవించింది.  స్థానక కాలమానం ప్రకారం ఉదయం 5 గంటల 19 నిముషాలకు భూకంపం సంభవించింది. కాఠ్మాండుకు సమీపంలోని సింధుపాల్చోక్ జిల్లాలోని రామ్చె కేంద్రంగా భూకంపం సంభవించింది.



భూకంపం తీవ్రత 6 వరకు ఉన్నట్లు నేపాల్ సిస్మొలాజికల్ సెంటర్ తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించగా ఇతర సిస్మోలాజికల్ సెంటర్లు మాత్రం కాస్త తక్కువగా పేర్కొన‌డం విశేషం. అయితే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే 5.4, యూరోపియన్-మెడిటేరియన్ సిస్మొలాజికల్ సెంటర్ 5.3 గా పేర్కొన‌డం గ‌మ‌నార్హం.  భూకంప కేంద్రం ఖాట్మండ్‌కు తూర్పుగా 100 కిలోమీటర్ల దూరంలో రామ్‌చేలో ఉన్నట్టు గుర్తించారు. ఇది చైనా టిబెట్ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. భూకంపం వల్ల ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదని నేపాల్ అధికారులు తెలిపారు.



ఈ భూకంపం కారణంగా చోటుచేసుకున్న ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా తెలియాల్సివుంది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6 పాయింట్లుగా నమోదయినట్లు నేపాల్ సిస్మొలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూకంప జోన్ లో ఉన్న దేశాల్లో నేపాల్ ఒకటి.  నేపాల్ లో నిత్యం ఏదొక ప్రాంతంలో భూకంపాలు వస్తూనే ఉంటాయి.  తాజాగా, నేపాల్ లో భూమి కంపించింది. కాగా 2015లో ఖాఠ్మాండులో వచ్చిన భారీ భూకంపంలో 8857 మంది మృతి చెందారు. 21952 గాయపడ్డారు. 35 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గతంలో ఖాట్మండు లోనూ ఖాట్మండులో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: