కరోనా వైరస్ వచ్చిన తరువాత పెద్ద పెద్ద సెల్రబిటీలు అంతా కూడా ఈ ప్రభావాన్ని తట్టుకోలేక ప్రపంచంలోని సురక్షితమైన పలు ప్రాంతాలకు తరలి వెళ్లారు. అందులో ముఖ్యంగా మాల్దీవులు మరియు గోవా కి ఎక్కువగా వెళ్లినట్లు తెలిసిన విషయమే. దీనికి ముఖ్యంగా రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి...అవేమిటంటే అక్కడి ప్రభుత్వాలు ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉండడం. మరియు ఈ రెండు ప్రదేశాలలో ప్రకృతి వాతారణం ఆహ్లాదకరంగా ఉండడం కారణాలుగా చెప్పవచ్చు. దీనితో అక్కడ బ్రతకడానికి ఎటువంటి ప్రమాదం ఉండబోదనే నమ్మకం. అయితే ప్రస్తుతం కరోనా మళ్ళీ విజృంభిస్తున్న వేళ మాల్దీవుల్లో 10 లక్షలు మంది పర్యాటకుల ఉండడానికి గల అన్ని వసతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దాదాపు 3 లక్షల మంది మాల్దీవులకు చేరుకున్నారని సమాచారం. ఈ మూడు లక్షల మందిలో 2 లక్షల మంది మన భారతీయులే కావడం గమనార్హం. ఇక్కడికి వెళుతున్న వారంతా కూడా కోటీశ్వరులే...ఇక్కడ అన్ని రకాల వసతులను ఎంజాయ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. బాడీ మసాజ్ ల దగ్గర నుండి విందు పొందు అన్ని రకాల సేవలను పొందడానికి ఇలాంటి వారు మాల్దీవులకు వెళుతున్నారు. దీని వలన మాల్దీవుల్లో కరోనా వలన ప్రపంచ దేశాల నుండి వచ్చే వారి సంఖ్య భారీగా  తగ్గడంతో ఆదాయం కూడా పడిపోయింది.

ఇటువంటి సంక్షోభ సమయంలో భారతీయులు మాల్దీవులకు రావడంతో వారి ఆదాయం మళ్ళీ పెరిగిందని వీరంతా సంతోషంగా ఉన్నారు. దీనితో ఈ సంవత్సరం మాల్దీవ్స్ ప్రభుత్వం 15 లక్షల మందికి అనుమతినివ్వడానికి నిర్ణయించింది. అంతే కాకుండా మాల్దీవ్స్ "3 V" అనే పద్దతిని తీసుకొచ్చింది. దీనర్ధం మా మాల్దీవ్స్ కి రండి...   కరోనాకి వ్యాక్సిన్ వేయించుకోండి...ఈ వెకేషన్ అంతా ఎంజాయ్ చేయండి. ఇక్కడ మాల్దీవ్స్ లో ప్రజలకి దాదాపు 51 శాతం మందికి వ్యాక్సినేషన్ చేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రావొచ్చని ఆ దేశం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: