ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంది.కరోనా కారణంగా ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. ఎక్కడా కూడా అధికారులను ఊపిరి పీల్చుకోనివ్వట్లేదు. కొన్ని రోజులుగా దేశంలో నిత్యం 1.5లక్షలకుపైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వీటిలో దాదాపు సగం కేసులు, మరణాలు ఒక్క మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌ ఛత్తీస్‌గఢ్‌, డిల్లీ తదితర ప్రాంతాలు ఉంటున్నాయి.కొవిడ్ సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కేసులు పెరుగుతుండటమే కానీ, ఏ రోజూ కాస్త ఉపశమనమైనా లేకుండా సంఖ్య పెరుగుతూనే ఉంది.ఇక దేశ రాజధాని ఢిల్లీలో వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.ఇక ముంబై, బెంగళూరు, కోల్ కత, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఈ వైరస్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఇక హాస్పిటల్ లో కూడా కరోనా కిట్లు, బెడ్లు లేక రోగులు సతమతమవుతున్నారు.మహా నగరాల్లో అయితే డాక్టర్లు సైతం కరోనాని అదుపు చెయ్యలేక చేతులు ఎత్తేసే పరిస్థితి నెలకొంది.


ఇక ఈ కరోనాకి చిన్నా లేదు పెద్ద లేదు. అలాగే ధనిక, పేద ఇలాంటి భేదాలు లేకుండా అందరిని పొట్టన పెట్టుకుంటుంది. ఇక రాజకీయ నాయకులను, పెద్ద పెద్ద హీరోలను సైతం ఏమాత్రం వదలకుండా వ్యాపిస్తుంది.ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ లో ట్వీట్ చేసిన పోస్ట్ ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారింది. ఆ పోస్టులో అన్ని ఎమోజిలను కలిపి ఒకచోట అలాగే మాస్క్ వున్న ఎమోజిని ప్రత్యేకంగా వాటి కింద ఉంచి వాళ్ళందరూ హాస్పిటల్ పాలవుతారు. ఈ మాస్క్ వేసుకున్న వారే సురక్షితంగా బ్రతకగలరు అని సింబాలిక్ గా సమాజానికి మెసేజ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.కాబట్టి సురక్షితంగా బ్రతకాలంటే తప్పకుండా మాస్కుని ధరించాలి. అలాగే సామాజిక దూరం పాటించి, మన ఆరోగ్యం పట్ల మనమే బాధ్యత వహించాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: