రాజకీయాల్లో పార్టీ మార్పులు చాలా సహజమే. కొందరు నాయకులు అవకాశాన్ని బట్టి వేరే పార్టీల్లోకి జంప్ చేసేస్తారు. ఏ నాయకుడైన అధికారం కోసం పార్టీలు మారుతుంటారు. గత కొన్నేళ్లుగా ఏపీలో ఈ జంపింగ్ కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. గతంలో టి‌డి‌పి అధికారంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు టి‌డి‌పిలోకి వచ్చేశారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక టి‌డి‌పి నేతలు వైసీపీలోకి జంప్ చేయడం మొదలుపెట్టారు.

అలాగే నలుగురు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుకు షాక్ ఇచ్చి, జగన్ చెంత చేరారు. అయితే ఈ నలుగురే ఇంకా కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అలాగే మీడియాలో కూడా కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతారని ప్రచారం వచ్చింది. కానీ ఆ నలుగురు ఎమ్మెల్యేల తర్వాత మరో ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్లలేదు.

మరి ఈ జంపింగ్ కార్యక్రమం ఇంతటితో ఆగిపోయిందా? లేక సడన్‌గా తెరపైకి వస్తుందా? అనేది తెలియకుండా ఉంది. ప్రస్తుతం రాజకీయాలని చూస్తుంటే టి‌డి‌పి ఎమ్మెల్యేలు ఎవరు వైసీపీలోకి వెళ్ళే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది. అలాగే టి‌డి‌పి పుంజుకుంటుంది. ఇంకా చెప్పాలంటే వైసీపీలోకి వెళ్ళిన నలుగురు ఎమ్మెల్యేలు సాధించింది ఏమి లేదు. అధికార పార్టీలో ఉన్నామని పేరే గానీ, వారికి నిధులు పెద్దగా వచ్చేది లేదు...అలాగే ప్రాధాన్యత కూడా తక్కువే.

కాబట్టి వైసీపీలోకి వెళ్ళిన ఒరిగేది ఏమి లేదని తెలుస్తోంది. అంటే ఇంకా ఏ టి‌డి‌పి ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్ళే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అయితే గంటా శ్రీనివాసరావు రాజకీయమే అర్ధం కాకుండా ఉంది. ఆయన టి‌డి‌పిలో యాక్టివ్‌గా ఉండటం లేదు. మరి గంటా ఏమన్నా జంప్ అవుతారేమో చూడాలి. అయితే టి‌డి‌పి శ్రేణులు, గంటాపై ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తున్నారు. మొత్తానికైతే టి‌డి‌పి ఎమ్మెల్యేల జంపింగ్‌కు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: