కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు తప్పడం లేదు. గత ఎన్నికల్లో జగన్ పట్టుపట్టి ఎంతో పార్టీలో ప్ర‌యార్టీ ఇవ్వ‌డంతో పాటు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన స‌ద‌రు నేత‌కు ఇప్పుడు సొంత నియోజకవర్గం లోని కష్టాలు ఎదురవుతున్నాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సొంత నియోజ‌క‌వ‌ర్గం మైల‌వ‌రంలోనే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇక్కడ దేవినేని ఉమ తిరిగి పుంజుకుంటున్నారని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన కొండపల్లి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలను చూస్తే ఈ విషయం క్లీయ‌ర్ గా అర్థ‌మ‌వుతోంది.

కొండ‌ప‌ల్లి ఓట‌ర్లు నియోజ‌క‌వ‌ర్గానికి గుండెకాయ లాంటి వారు. ఇబ్ర‌హీప‌ట్నం - కొండ‌ప‌ల్లి రెండు మేజ‌ర్ పంచాయ‌తీల‌ను క‌లిపి ఇక్క‌డ కొండ‌ప‌ల్లి మున్సిపాల్టీ గా ఏర్పాటు చేశారు. ఇక్క‌డ అన్ని వ‌ర్గాల ఓట‌ర్లు ఉంటారు. ముస్లింలు - వెనకబడిన వర్గాలు - ఉద్యోగులు - వీటీపీఎస్ లో పనిచేసి పదవి విరమణ చేసిన ఉద్యోగులు - బీసీలు కూడా ఓటర్లుగా ఉన్నారు. వీరంతా ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టే ఫ‌లితాలు చెప్పేశాయి.

పైగా జ‌గ‌న్ ఇటీవ‌ల ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చిన త‌ల‌శిల ర‌ఘురాం ది కూడా కొండ‌ప‌ల్లి ప్రాంత‌మే..! ఇప్పుడు ఇక్క‌డ మున్సిపాల్టీ లో టీడీపీ - వైసీపీకి స‌మానంగా కౌన్సెల‌ర్ సీట్లు వ‌చ్చినా కూడా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఓటుతో పాటు ఇండిపెండెంట్ కౌన్సెల‌ర్ కూడా టీడీపీ గూటికి రావడంతో ఇక్క‌డ టీడీపీ త‌న ఆధిప‌త్యం చాటుకున్న‌ట్టు అయ్యింది. ఇటు మాజీ మంత్రి ఉమా త‌న సొంత సామాజిక వ‌ర్గం అయిన క‌మ్మ ల‌లో కూడా క్ర‌మ క్ర‌మంగా వ్య‌తిరేక‌త త‌గ్గించు కుంటున్నారు.

ఇక వ‌సంత్ దూకుడు.. ఇటీవ‌ల ఉమాను అరెస్టు చేయించి జైల్లో పెట్ట‌డం లాంటి ప‌రిణామాలు కూడా ఇక్క‌డ వ‌సంత‌కు మైన‌స్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: