దేశంలో ఎక్కడో ఏ మూలనో అన్నదాతలు బలికాని రోజంటూ లేనేలేదు. పాలకులు మాత్రం సభలు, సమావేశాలు, ఎన్నికల సంబరంలో మునిగితేలుతూ ప్రజలను విస్మరిస్తూ రైతు ఆత్మహత్యలకు కారణం అవుతున్నారు. నిజమా..? కాదా..? దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం కోసం మేలు చేసే చట్టాలను చేసినమన్న కేంద్ర ప్రభుత్వం రైతులు సంవత్సరకాలంగా చేసినటువంటి ఉద్యమానికి తలవంచి రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకున్న సంగతి మనందరికీ తెలిసినదే. రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి కేంద్ర చట్టాలను సమర్థించి మరొకసారి కేంద్ర చట్టాలపై విమర్శించి ప్రజలను రైతులను సందిగ్ధంలో పెట్టడమే కాకుండా ఇటీవల ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బాధ్యతంతా కేంద్రం పైననే నెట్టి మరికొంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైనది.

ప్రజలు తెరాస వెంటనే ఉన్నారట:

  గత నెల రోజులుగా సాగుతున్నటువంటి శాసనమండలి సభ్యుల ఎంపిక డిసెంబర్ 14వ తేదీతో ముగిసింది. శాసన సభలో బలం ఉన్న కారణంగా స్థానిక సంస్థల బాధ్యులు ఎక్కువగా టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నందున 12 స్థానాలకు గాను 12 స్థానాలను తెరాస పార్టీ గెలిచింది. డిసెంబర్ 10వ తేదీన స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎంపికకు గాను జరిగిన ఓటింగ్లో ఆరు స్థానాల్లోనూ అధికార పార్టీ గెలిచినప్పటికీ అధికార పార్టీ ఓట్లు స్వతంత్రులకు, కాంగ్రెస్ పార్టీకి క్రాస్ ఓటింగ్ జరిగిన విషయాన్ని మరిచిపోయినారు.  ఆరు స్థానాల ఫలితాలు రాగానే ప్రజలు తెరాస వెంటనే ఉన్నారని ఒకరు, పరిపాలనకు నిజమైన తార్కాణమని మరొకరు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని మరొక మంత్రి ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించడం బుద్ధి జీవులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులను ఆశ్చర్యపరుస్తున్నది. ఎన్నికలలో సామాన్య ప్రజానీకం ఓట్లు వేయలేదు. శాసన సభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాత్రమే ఓట్లు వేసి 12 సీట్లను కైవసం చేసుకుకున్నంత మాత్రాన ప్రజలు తెరాస వెంట ఉన్నారన డానికి ఆధారాలు ఎక్కడివి..? ఈ ఎన్నికల విధానము, విషయం అసలు సామాన్య ప్రజానీకం తెలియనే తెలియదు..

మరింత సమాచారం తెలుసుకోండి: