మహిళల భద్రతా ఏర్పాట్ల విషయంలో భారత రైల్వే మరో అడుగు ముందుకేసింది. కేవలం సిటు రిజర్వేషన్ కాకుండా ఇకమీదట ప్రయాణ సమయంలో కూడా వారికి రక్షణ కల్పించడానికి సిద్ధం అయ్యింది రైల్వే శాఖ. ఎక్స్ ప్రెస్ రైళ్లు, సుదూర మెయిల్ లలో ఆరు బెర్తుల రిజర్వేషన్ కోటా, గరీబ్ రధ్, రాజధాని, దురంత్ లోని 3 ఏసీ క్లాసులలో 6బెర్తుల రిజర్వేషన్ కోటా, పూర్తిగా ఏసీ ఎక్స్ ప్రెస్ రైళ్లను కేవలం మహిళలకే కేటాయిస్తున్నట్టుగా రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈ రిజర్వేషన్లు అన్ని వయసుతో నిమిత్తం లేకుండా ఉంటాయి. ఒక్కో స్లీపర్ క్లాస్ లో 6-7 లోయర్ బెర్తులు, ఒక్కో కోచ్ కు 4-5 లోయర్ బెర్తులు కలిపి రిజర్వేషన్ కోటా ఉంటుంది.

3ఏసీ, 2ఏసీ తరగతులలో ఒక్కో కోచ్ కు 3-4 లోయర్ బెర్తులు సీనియర్ సిటిజన్స్, 45ఏళ్ళు పైబడిన వారికి కేటాయించనున్నారు. అన్నిటికంటే, ఒంటరిగా ప్రయాణించే మహిళల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇలాంటి వారి రక్షణ కోసం ప్రత్యేకించి శిక్షణ పొందిన మహిళా అధికారులు, సిబ్బందిని నియమించనున్నారు. రైల్వే స్టేషన్లలో కూడా మహిళల సహా ప్రయాణికుల భద్రత కోసం భారత రైల్వేస్ జీఆర్పీ సమన్వయంతో పని చేస్తుంది. మహిళలు రైలు ఎక్కినప్పటి నుండి దిగే వరకు వారి రక్షణ కోసం మేరీ సహేలి అనే ఆర్పీఎఫ్ సేవలను గత ఏడాది ప్రారంభించారు.

సాధారణంగా రక్షణ కోసం ఆర్పీఎఫ్ సహా జీఆర్పీ ద్వారా ప్రయాణికులను నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉంటారు. అయితే ఒంటరి మహిళల విషయంలో ఆయా హాల్ట్స్ లో కూడా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దానికి ఆయా అధికారులు చొరవ చూపించాల్సి ఉంది అన్నారు మంత్రి. మహిళలకు కేటాయించిన కంపార్ట్మెంట్స్ లో ఇతరులు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆయా భద్రతను పెంచడానికి 4934 కోచ్లు, 838 స్టేషన్ లలో సీసీటీవీ కెమెరాలు ఇప్పటీకే ఏర్పాటు చేయబడ్డాయి. అప్పటికి ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే రైల్వే హెల్ప్ లైన్ 139కి కాల్ చేయాలి. ఇది 24x7 పని చేస్తుంది. సామజిక మాద్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి ద్వారా వచ్చిన పిర్యాదులు కూడా పరిష్కరించడానికి ఆయా అధికారులు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి తెలిపారు. ప్రయాణికులకు కూడా దొంగతనాలు, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ వంటి వాటిపై ఎప్పటికప్పుడు వివిధ ప్రకటనల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: