పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన దేశం అనే విషయం తెలిసిందే. మొదటి నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఉగ్రవాదులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది పాకిస్థాన్ అని చెప్పాలి. అయితే ప్రపంచ దేశాలు పాకిస్థాన్లో ఉగ్రవాదం ఉంది అని నిరూపించినప్పటికి తమకు ఉగ్రవాదంతో సంబంధం లేదు అంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ ఉంటుంది పాకిస్తాన్. దేశ ప్రజల ప్రయోజనాలను సైతం గాలికొదిలేసి ఉగ్రవాదులను పెంచి పోషించడమే లక్ష్యంగా ఎన్నోనిధులు ఖర్చు పెడుతూ ఉంటుంది. మత రాజ్య స్థాపన లక్ష్యంగా ఎన్నో దేశాలలో ఉగ్రవాదులను అక్రమంగా చొరబడేలా చేసి మారణహోమాలు సృష్టిస్తూ ఉంటుంది పాకిస్తాన్.



 ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పాకిస్థాన్ ఎన్నో దేశాల్లో మారణహోమం సృష్టించి బాంబు పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం ఇప్పుడు పాకిస్తాన్ కు ముప్పుగా మారిపోతుంది అని అర్థమవుతుంది. ప్రస్తుతం ఉగ్రవాదులకు మరో రూపమే ఆఫ్ఘనిస్థాన్లో పాలన సాగిస్తున్న  తాలిబన్లు. అయితే తాలిబన్లు పాకిస్తాన్ మధ్య మంచి బంధమే ఉంది.కానీ తాలిబన్ల లోని ఒక వర్గం మాత్రం పాకిస్థాన్కు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది అన్నది అర్ధమవుతుంది.



 దీంతో గత కొన్ని రోజుల నుంచి ఆఫ్ఘనిస్థాన్ పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకోన్నాయి అన్న విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో జూరాంగ్ రేఖ వద్ద ఇక ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ నుండి తాలిబన్లు అటు పాకిస్థాన్కు చెందిన సరిహద్దు ఫెన్సింగ్ ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అయితే దాదాపు 20 రోజుల నుంచి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్థాన్ సరిహద్దుల్లో తాలిబన్లు పాకిస్థాన్ సైన్యం మధ్య జరుగుతున్న ఘర్షణ తీవ్ర రూపం దాలుస్తుంది అన్నది ఇటీవల బయటపడింది. ఇక రానున్న రోజుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: