టీడీపీ అధినేత చంద్రబాబు..చాలా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు...గతంలో మాదిరిగా కాకుండా...ఈ సారి అన్నీ పనులు ముందుగానే చేసేస్తున్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారం రావాలంటే ఆయుధాలని ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలనే ఫార్ములాని బాబు బాగా ఫాలో అవుతున్నారు..అందుకే ఇంకా ఎన్నికలకు రెండేళ్ళు పైనే సమయం ఉండగానే..అప్పుడే అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసేస్తున్నారు...ఇలా చేస్తే అభ్యర్ధులు ప్రజల్లోకి బలంగా వెళ్తారని, అలాగే ఎన్నికల ముందు అభ్యర్ధులని ఫిక్స్ చేయడం వల్ల వచ్చే అసంతృప్తి నేతల బెడద కూడా తగ్గుతుందని చెప్పి..ఇప్పుడే క్యాండిడేట్లని ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్నారు.

అలాగే జనసేనతో పొత్తు ఉంటే ఇబ్బంది లేకుండానే సీట్లు ఫిక్స్ చేస్తున్నారు..ఒకవేళ జనసేనకు కేటాయిస్తామనే సీట్లలో సమన్వయకర్తలని పెట్టడం..లేదా డమ్మీ ఇంచార్జ్‌లని పెట్టడం చేస్తున్నారు. ఇక మిగతా సీట్లలో టీడీపీ అభ్యర్ధులని ఫిక్స్ చేసేస్తున్నారు..ఇదే క్రమంలో గుంటూరు జిల్లాలో మెజారిటీ సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేసినట్లే అని చెప్పొచ్చు.

రేపల్లె-అనగాని సత్యప్రసాద్, పొన్నూరు-ధూళిపాళ్ళ నరేంద్ర, తాడికొండ-తెనాలి శ్రావణ్ కుమార్, చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు, గురజాల-యరపతినేని శ్రీనివాసరావు, వినుకొండ-జి‌వి ఆంజనేయులు, మాచర్ల-జూలకంటి బ్రహ్మానందరెడ్డి, బాపట్ల-సతీశ్ వర్మ, వేమూరు-నక్కా ఆనందబాబు, పెదకూరపాడు-కొమ్మాలపాటి శ్రీధర్ పోటీ చేయడం ఖాయం. అయితే సత్తెనపల్లి సీటు కోడెల శివరాంకు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే నరసారావుపేట సీటు రెడ్డి నాయకుడుకు ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తోంది..అలాంటప్పుడు చదలవాడ అరవింద్ బాబుకు సీటు ఫిక్స్ చేస్తారో లేదో తెలియని పరిస్తితి.

అటు తెనాలి సీటులో ఆలపాటి రాజా ఉన్నారు...ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే ఈ సీటు ఆ పార్టీకే ఇవ్వొచ్చని చర్చ నడుస్తోంది..ఇక్కడ నాదెండ్ల మనోహర్ పోటీ చేసే ఛాన్స్ ఉంది..పొత్తు లేకపోతే తెనాలి సీటు రాజాదే..పొత్తు ఉంటే మాత్రం వేరే సీటు కేటాయించి, తెనాలి జనసేనకు ఇస్తారేమో చూడాలి. ఇక గుంటూరు వెస్ట్, ఈస్ట్, ప్రత్తిపాడు సీట్లలో పూర్తి క్లారిటీ లేదు. మొత్తానికి గుంటూరులో తెలుగుదేశం పార్టీ సీట్లు దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: