పాన్ , ఆధార్ కార్డులు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్స్ లలో భాగం అయ్యాయి.. కొన్ని సార్లు కొన్ని రూల్స్ మారుతున్న సంగతి తెలిసిందే.. నిజానికి ఈ గడువు ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం ఫైన్ చెల్లించి లింక్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఆధార్తో పాన్ను లింక్ చేయడానికి రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఫైన్తో లింక్ చేసే సదుపాయం సైతం వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మరోసారి వినియోగదారులను అలర్ట్ చేసింది.


గడువు తేదీలోగా ఆధార్తో లింక్కాని పాన్కార్డులు పనిచేయనవి తెలిపింది. ఫైన్తో కూడిన గడువు ముగిసేలోగా లింక్ చేసుకోవాలని సూచించింది. ఒకవేళ మార్చిన 31నాటికి కూడా ఆధార్తో పాన్ను లింక్ చేసుకోకపోతే 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాన్కార్డ్ నిరుపయోగం అవుతుంది. భవిష్యత్ అవసరాలకు పాన్ కార్డును ఉపయోగించుకోలేరు. దీంతో బ్యాంక్ ఖాతాలు, డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ చేయలేరు. ఐటీ రిటర్న్లు ఫైల్ చేయలేరు. బ్యాంకుల్లో రూ. 50 వేలకి మించిన ట్రాన్సాక్షన్స్ చేయలేరు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్, ఆధార్ లింక్ చేయాలనుకునే వారు ముందుగా జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది.


ఐటీ చట్టం-1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని వారు తప్పనిసరిగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే మీ కార్డు లింక్ అయ్యాయొ లేదో డౌట్ ఉంటే ఇలా చెక్ చేసుకోండి..అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఒక ఆప్షన్‌ ఉంది. ఇందు కోసం ముందుగా ఈ వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయాలి. అనంతరం పాన్‌ కార్డ్ నెంబర్‌ను పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి చివరిగా క్యాప్చా కోడ్‌ను ఇవ్వాలి. దీంతో మీ పాన్‌ కార్డు, ఆధార్‌తో లింక్‌ అయ్యిందో లేదో సింపుల్‌గా తెలిసిపోతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: