పోయిన ఎన్నికల్లో కాపులను మోసంచేసిన చంద్రబాబునాయుడు రాబోయే ఎన్నికల్లో బీసీలను మోసంచేయటానికి రెడీ అవుతున్నట్లున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామనే తప్పుడు హామీనిచ్చి కాపుల ఓట్లేయించుకున్నారు. 2014 ఎన్నికలంటే రాష్ట్రవిభజన నేపధ్యంలో జరిగిన ఎన్నికలు. చంద్రబాబుకు ఒకవైపు బీజేపీ, మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాన్ అండగా నిలిచారు కాబట్టి ఏవేవో ఆచరణసాధ్యంకాని హామీలిచ్చేసి అధికారంలోకి వచ్చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అసలు రూపం బయటపడింది. చంద్రబాబు హామీతో తాము మోసపోయామని కాపులకు అర్ధమైంది. సరే వివిధ కారణాలతో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.

సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో గెలవటంకోసం మళ్ళీ ఆకాశమేహద్దుగా హామీలతో చంద్రబాబు రెచ్చిపోతున్నారు. 2014 అనుభవంతో జనాలు చంద్రబాబుకు ఓట్లేస్తారా లేదా అన్నది చూడాలి. అయితే రాజమండ్రి మహానాడులో మొదటి విడత ఇచ్చిన 6 హామీల్లో బీసీలకు రక్షణ చట్టం అన్నది ఎవరికీ అర్ధంకావటంలేదు. బీసీలకు రక్షణ చట్టం అన్నది ఒక బ్రహ్మపథార్ధంగా తయారైంది. ఎందుకంటే బీసీలకు ఎవరినుండి రక్షణ అవసరం ? సమాజంలోని జనాభాలో బీసీలే 50 శాతం అంటున్నారు. జనాభాలో అత్యధిక శాతమైన బీసీలకు ప్రత్యేకించి రక్షణ చట్టం ఏమిటో అర్ధంకావటంలేదు. రాజ్యాంగంలో బీసీలకు ప్రత్యేకమైన రక్షణ కల్పించలేదు.

జర్నలిస్టులు, ఐఏఎస్ రిటైర్డ్ అధికారులు, బీసీ సంఘాల నేతల్లో ఎవరిని అడిగినా తమకు ఈ హామీ అర్ధంకావటంలేదనే అంటున్నారు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలంటే సామాజిక వివక్షకు గురయ్యారు కాబట్టి రాజ్యాంగంలో వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని హక్కులు, రిజర్వేషన్లు, రక్షణచట్టం ఏర్పాటుచేశారు.  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం ఇలాగే ఏర్పాటైంది. మరి బీసీలు ఎప్పుడూ సామాజిక వివక్షకు గురైందిలేదు.

కాలప్రభావం వల్ల కులవృత్తులు దెబ్బతినటంతో వాటిపై ఆధారపడిన కుటుంబాల్లో ఎక్కువమంది దెబ్బతిన్నారు. అలాంటి వాళ్ళకోసం సంక్షేమపథకాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఎవరికీ అర్ధంకాని రీతిలో ఏదో మాయమాటలు చెప్పేసి పార్టీకి దూరమైన బీసీల ఓట్లను వేయించుకుందామని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లున్నారు. మరి చంద్రబాబు మాయమాటలకు బీసీలు పడిపోతారా ? ఓట్లేస్తారా ?మరింత సమాచారం తెలుసుకోండి: