మహర్షి అనేది నిఖార్సైన హిట్టా అంటే మహేష్ అభిమానులు కూడా చెప్పలేని పరిస్థితి. ఇజం చెప్పాలంటే ఈ సినిమా చెప్పుకోతగ్గ హిట్టని నిర్మాతలు కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు. అయితే మహేష్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. వంశీని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ఏకంగా పబ్లిక్ స్టేజి మీద వంశీకి ముద్దు కూడా ఇచ్చాడు. అయితే అక్కడికేదో చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసినట్టు ఫీలయిపోతున్న వంశీ పైడిపల్లి తనకి బాసటగా మహేష్ నిలబడే సరికి కాస్త కూడా నేల మీద నిలబడలేకపోతున్నాడు.
మహేష్ ఎందుకని ఇంత ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నాడనేది అతనికే ఎరుక. కానీ చెప్పిన బడ్జెట్ కంటే దాదాపు నలభై కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టించిన వంశీ పైడిపల్లిపై ముగ్గురు నిర్మాతలూ సైలెంట్‌గా ఫైర్ అవుతున్నారు. కానీ అతనికి హీరోగారే అండగా నిలబడే సరికి గట్టిగా మాట్లాడలేక సైలెంట్‌గా చోద్యం చూస్తున్నారు. మహర్షి ఎలా చూసినా కాస్ట్ ఫెయిల్యూర్ అనేది జగద్విదితం.
నష్టాలు గ్యారెంటీ అని తేలిపోయిన సినిమాని చూపించి మహేష్ ల్యాండ్‌మార్క్ సినిమా, తన కెరియర్ బెస్ట్ అని చెప్పుకోవడమూ బహిరంగ నిజం. అయితే ఇది హీరో డామినేటెడ్ ఇండస్ట్రీ. దర్శకుడి మీద కోపంతో హీరోతో సున్నం పెట్టుకోలేరు నిర్మాతలు. అందుకే పైడిపల్లి అతిని కూడా భరిస్తూ మహేష్ గుడ్ బుక్స్‌లో మిగిలిపోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో అండర్ కరెంట్‌గా అందరికీ పైడిపల్లి పెట్టించిన వృధా ఖర్చు గురించి పాకిపోవడంతో ఇప్పుడతని పేరు చెబితే నిర్మాతలు పారిపోతున్నారని గుసగుసలాడుతున్నారు. తనపై వస్తోన్న వదంతులని కౌంటర్ చేయాలంటే పైడిపల్లి త్వరగా ఏదో ఒక సినిమా అనౌన్స్ చేయక తప్పదు.