ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా పై ప‌ట్టు సాధించేందుకు చంద్ర‌బాబు గ‌త రెండు ద‌శాబ్దాల నుంచి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ జిల్లాలో బాబుకు ప‌ట్టు చిక్క‌డం లేదు. 2004 ఎన్నిక‌ల నుంచి క‌డ‌ప జిల్లాలో ప్ర‌తి ఎన్నిక‌కు టీడీపీ ఒక్క సీటు మాత్ర‌మే గెలుస్తూ వ‌స్తోంది. 2004 ఎన్నిక‌ల్లో క‌మ‌లాపురం సీటుతో టీడీపీ స‌రిపెట్టుకుంది. అదే 2009 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి ప్రొద్దుటూరులో లింగారెడ్డి ఒక్క‌రు మాత్ర‌మే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే 2014లో ఏపీలో టీడీపీ ఘ‌న‌విజ‌యం సాధించినా కూడా క‌డ‌ప జిల్లాలో మాత్రం రాజంపేట నుంచి మాత్ర‌మే టీడీపీ గెలిచింది.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో అస‌లు టీడీపీ జిల్లాలో ఖాతాయే తెర‌వ‌లేదు. ఇక ప‌ది నియోజ‌క‌వ‌ర్గా ల్లో ఒక‌టి రెండు చోట్ల త‌ప్పా టీడీపీకి ఎక్క‌డా కూడా బ‌ల‌మైన అభ్య‌ర్థులు లేకుండా పోయారు. అయితే జ‌మ్మ‌ల‌మ‌డుగు లాంటి చోట్ల అస‌లు టీడీపీ ఎప్పుడో 1999 లో మాత్ర‌మే గెలిచిందే త‌ప్పా అప్ప‌టి నుంచి ప్ర‌తి సారి ఓడిపోతూ వ‌స్తోంది. అలాంటి చోట బ‌ల‌మైన అనుచ‌ర వ‌ర్గం ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.

దేవ‌గుడి నారాయ‌ణ రెడ్డితో పాటు ఆయ‌న అనుచ‌రులు అంద‌రూ క‌లిసి ఈ నెల 20వ తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. నారాయణరెడ్డి తో పాటు ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీలో చేరిన వెంట‌నే భూపేష్ రెడ్డి జ‌మ్మ‌ల మ‌డుగు టీడీపీ ఇన్ ఛార్జిగా బాధ్య‌త‌లు స్వీక‌రిం చ నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌మ్మ‌ల మ‌డుగులో బ‌ల‌మైన అనుచ‌ర గ‌ణం ఉన్న దేవ‌గుడి కుటుంబం నుంచే కీల‌క నేత‌లు టీడీపీ లో చేరుతుండ‌డంతో ఇప్పుడు చంద్ర‌బాబు కు జ‌మ్మ‌ల‌మ‌డుగు టీడీపీ విష‌యంలో బాబు పెద్ద రిలాక్స్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: