వైనాట్ పులివెందుల‌ అని ప‌దే ప‌దే చెబుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు అందుకు త‌గిన విధంగా నే అడుగులు వేస్తున్నారు. త‌న పార్టీ త‌ర‌ఫునే కాకుండా పొత్తు పార్టీల‌తోనూ బ‌ల‌మైన నాయ‌కుల‌కే అవ‌కా శం ద‌క్కేలా చేస్తున్నార‌ని టాక్‌. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప‌లో వైసీపీ డీకొనే ధైర్యం.. స‌త్తా ఈ నాయ‌కుల‌కు ఉందా?  అస‌లు వీరి ధ‌న‌బ‌లం, ప్ర‌జాబ‌లం స్థాయి ఎంత‌? అనేది ఆస‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలో క‌డ‌ప పైనే ఎక్కువ‌గా అంద‌రి దృష్టీ ఉండ‌డం గ‌మ‌నార్హం.

కడప  పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది దివంగత వైఎస్‌. దశాబ్దాలుగా జిల్లాను ఏకచత్రాధిప త్యంతో ఏలిన వైఎస్‌ కుటుంబంలో...ఇప్పుడు ఆయన వారసుడు జగన్ సైతం ఆ పట్టుకోల్పోకుండా రాజకీయం చేస్తున్నారు. వివిధ వ్యాపారాలు చేసిన జగన్ వందల కోట్లు కూడబెట్టారు. గత ఎన్నికల  సమయంలో ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం జగన్ ఆస్తుల విలువ 510 కోట్లు కాగా...అప్పులు 74 కోట్లు పైగానే ఉన్నట్లు తెలిపారు.

వివిధ బ్యాంకుల్లో జగన్ పేరిట ఉన్న బాండ్లు విలువ 4 కోట్లపైనే ఉండగా.. వివిధ సంస్థల్లో పెట్టిన పెట్టుబ డులు, షేర్ల విలువు 381 కోట్లుగా ఉంది. దాదాపు పదికోట్లు విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు ఉన్నాయి.  జగన్ మొత్తం చరాస్తుల విలువ 443 కోట్లు ఉంది. 24 కోట్ల విలువైన కమర్షియల్ బిల్డింగ్‌లు, 25 కోట్ల విలువైన ఇళ్లు ఆయన పేరిట ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ 66 కోట్లు ఉంది.  

జగన్ మేనమామ, కమలాపురం వైసీపీ అభ్యర్థి పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డికి 40 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయి. 14కోట్లు అప్పులు ఉన్నాయి. క‌డ‌ప అభ్య‌ర్థి, ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఆస్తులు దాదాపు 4 కోట్లు వరకు ఉన్నాయి. బాండ్లు, బ్యాంకులో క్యాష్, పర్సనల్‌ లోన్ అడ్వాన్స్‌లు కలిపి 2 కోట్ల 28లక్షలు  ఉన్నాయి. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ఆరున్నర కోట్ల ఆస్తులు, రెండు కోట్ల అప్పులు ఉన్నాయి.

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మైదుకూరు ఎమ్మెల్యే అభ్య‌ర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు 66 కోట్ల ఆస్తులు ఉన్నాయి. బాండ్లు,షేర్లు విలువే 45 కోట్లు వరకు ఉండగా....మొత్తం చరాస్తులు కలిపి 47 కోట్లు ఆస్తి ఉంది. బీజేపీ నేత, జ‌మ్మ‌ల‌మ‌డుగు అభ్య‌ర్థి ఆదినారాయణరెడ్డికి మూడుకోట్ల ఆస్తులు ఉండగా 9 లక్షల అప్పు ఉంది. కడప ఎంపీగా మరోసారి వైసీపీ తరపున పోటీ చేస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డికి దాదాపు 19 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.

రాజంపేట నుంచి వైసీపీ తరపున బరిలో ఉన్న మిథున్‌రెడ్డికి 66.5 కోట్ల ఆస్తులు ఉండగా...20 కోట్ల అప్పు ఉంది. బాండ్లు, షేర్ల రూపంలో 9 కోట్లు, పర్సనల్‌లోనూ అడ్వాన్స్‌ ద్వారా మరో ఐదుకోట్లు ఆస్తి ఉంది. మిగిలినవి అన్నీ కలిపి మిథున్‌రెడ్డికి 14.66 కోట్ల చరాస్తులు ఉన్నాయి.  బీజేపీ త‌ర‌ఫున రాజంపేట నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి మాజీముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆస్తులు  18 కోట్లు వరకు ఉన్నాయి. ఆయన మొత్తం చరాస్తుల విలువ 5 కోట్లు ఉండగా...ఏడుకోట్ల విలువైన వ్యవసాయ భూములు ఉన్నాయి. సో.. దీనిని బ‌ట్టి వైనాట్ పులివెందుల సాధ్య‌మేనా? అన్న‌ది టీడీపీ ఆలోచించుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: