చంద్రబాబు గెలవాలని బాగా కోరుకునే వాళ్లలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్న రియల్ స్టేట్ పర్సన్స్, బిల్డర్స్ టీడీపీ గెలవాలని పూజలు కూడా చేస్తుంటారు. దీనికి ముఖ్య కారణం వారు చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతిలో భూములు కొనుగోలు చేశారు. అమరావతి రాజధాని అయితే వారు కొన్న భూములకు రెక్కలు వస్తాయి. అవి భారీ ధర పలుకుతాయి. దీనివల్ల వీళ్ళకి వందల వేల కోట్లలో లాభాలు లభిస్తాయి. అనుకున్నట్లుగానే చంద్రబాబు అమరావతిని రాజధానిని చేస్తానని ప్రకటించగానే అక్కడ భూములు భారీ రేటు పలికాయి.

ఇక అమ్ముదాం అనుకుంటున్న సమయంలోనే చంద్రబాబు దిగిపోయారు. ఏపీ సీఎం అధికారంలోకి వచ్చారు. తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించలేదు. వైజాగ్ కి రాజధాని షిఫ్ట్ చేస్తామని జగన్ చెప్పారు. దాంతో అమరావతిలో వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసిన వారందరిని గుండె జారిపోయింది. ఆ మాట అన్న తర్వాత ఈ భూముల ధరలు తగ్గిపోయాయి. వారు కొనుగోలు చేసిన రేట్ల కంటే తక్కువకు పడిపోలేదు కానీ వారు వాటిని అమ్ముకోలేకపోతున్నారు. ఒకవేళ టీడీపీ గెలిస్తే భూములు ధరలు పెరుగుతాయని వాటిని కొంతమంది అమ్మకుండా అలానే ఉంచుతున్నారు.

అమరావతి ప్రాంత రియల్ ఎస్టేటర్లు, బిల్డర్లు మాత్రమే కాకుండా కృష్ణ గుంటూరు వంటి ప్రాంతాలలో ఉన్న రియల్ ఎస్టేటర్లు కూడా వైసీపీ ఓటమిని బాగా కోరుకుంటున్నారు. అమరావతిలో పాతిక లక్షలకు కొనుగోలు చేసిన భూమి చంద్రబాబు రాజధాని ప్రకటనతో 60, 80 కోటి రూపాయల దాకా వెళ్ళిపోయాయి. ఇప్పుడు అవి 60 లక్షలు, ఆ రేంజ్ లో ధర పలుకుతున్నాయి కానీ కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందువల్ల విజయవాడ గుంటూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది స్తంభించింది. అయితే వీరి కోరికలు నెరవేరుతాయా అనేది ప్రశ్నలకు ఎందుకంటే సంక్షేమ పథకాల వల్ల జగన్ పేద, మధ్య తరగతి ప్రజలందరికీ తనవైపు తిప్పుకున్నారు. దానివల్ల ఆయన ఈసారి కూడా గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: