
మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి పార్టీకి వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశాడు. అయినా కూడా అల్లు అర్జున్ డైలాగ్ ని నారా లోకేష్ వాడుకొని మిస్టేక్ చేశాడని వైసిపి నేతలు అంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అందులో భాగంగానే నారా లోకేష్ మాట్లాడుతూ తల్లిని, చెల్లిని బయటకు పంపించింది జగన్ అని అన్నారు. సొంత బాబాయిని చంపింది ఎవరు అంటూ ప్రశ్నించారు. రెడ్ బుక్ ని చూసి భయపడడం కాదు ఎర్ర రంగును చూస్తేనే వణికిపోతున్నారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ప్రదేశంగా మార్చేసారని మంత్రి లోకేష్ అన్నాడు.
గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క కొత్త కంపెనీ కూడా తీసుకురాలేదు. అంతేకాకుండా ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమి వేశారు. విషం కన్నా ప్రమాదకరమైన మద్యాన్ని అమ్మి 30 వేల మందిని పొట్టన పెట్టుకున్నారని ఫైర్ అయ్యాడు. ఏపీ ప్రభుత్వాన్ని కాపాడడం కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పాడు. ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ అందరూ వారి పనులను పక్కనపెట్టి కూటమి ప్రభుత్వం కోసం పనిచేశారని అన్నాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని నారా లోకేష్ మాట్లాడారు. ప్రస్తుతం నారా లోకేష్ మాట్లాడిన ఈ మాటలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.