- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ , బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత సొంత పార్టీకి చెందిన నేతలపై తీవ్రమైన విమర్శలు ఎక్కు పెట్టారు. బిజెపి నేతలకు చెందిన హాస్పిటల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్ళింది ఎవరు ?అందరికీ తెలిసింటూ పార్టీలోని అగ్ర నేతలను ఆమె పరోక్షంగా విమర్శించారు. తన లేక ఎవరూ లీక్ చేశారు ?తేల్చమంటే తనపై పడి ఏడుస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. తాను పదవులు కోరినట్లు తనపై పత్రికల్లో తప్పుడు వార్తలు రాయించారని ... కేసీఆర్ లెక్క తాను చాలా తిక్కదానిని అని ఆమె పునరుద్గాటించారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు రావని ... సూటిగా మాట్లాడుతానని కుండ బద్దలు కొట్టేశారు. మా పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు సోషల్ మీడియాలో మహాభారతం పాత్రలు వేస్తున్నారంటూ ఆమె వ్యంగంగా అన్నారు. వరంగల్ స‌భ త‌మ వ‌ల్లే సక్సెస్ అయిందని కొందరు ఊహించుకుంటున్నారని ... కెసిఆర్ ను మోసేంత పెద్ద వాళ్ళు అయిపోయారని వారంతా భావిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇక జైలుకు వెళ్లే సమయంలో పార్టీకి పదవికి రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దన్న విషయాన్ని సైతం ఆమె గుర్తు చేశారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనను నిజామాబాద్ లో ఎంపీగా పోటీ చేస్తే ఓడించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం గా ఉండగా చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారని చంద్రబాబు ఏమి చేసినా కేంద్రం అడ్డుకోవడం లేదని ? ఒకంత అసహనాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు. కాళేశ్వ‌రం పై ఏర్పాటు చేసిన కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పార్టీ ఎందుకు కార్యాచరణ తీసుకోలేదని పార్టీలోని అగ్ర నేతలను ఆమె సూటిగా ప్రశ్నించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: