గీత గోవిందం మూవీని నారా రోహిత్ డిజాస్టర్ అని అన్నారా.. ఇంతకీ నారా రోహిత్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాని డిజాస్టర్ అని ఎందుకు అన్నారు.. అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం . విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా పరశురాం డైరెక్షన్ వహించిన గీతగోవిందం మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి ఈ మూవీ డిజాస్టర్ అంటూ నారా రోహిత్ తాజాగా తన భైరవం మూవీ ప్రమోషన్స్ లో చెప్పారు. అయితే గీత గోవిందం మూవీ గురించి నారా రోహిత్ మాట్లాడుతూ..నేను బాణం సినిమా చేస్తున్న సమయంలో నాకు గీతగోవిందం సినిమా లైన్ చెప్పారు.ఈ సినిమాలో మొదటగా హీరోగా నన్నే చేయమన్నారు.

కానీ నేను ఆ సినిమాని రిజెక్ట్ చేశాను.అప్పటికే బాణం సినిమాలో చేస్తున్నాను.అయితే ఈ సినిమా విజయ్ దేవరకొండ చేసి హిట్ కొట్టారు. ఒకవేళ నేను చేసి ఉంటే కచ్చితంగా గీతగోవిందం డిజాస్టర్ అయ్యేది. ఇక విజయ్ దేవరకొండసినిమా చేసే కంటే ముందు అర్జున్ రెడ్డి వంటి హిట్ మూవీ తన ఖాతాలో ఉంది. ఇక అర్జున్ రెడ్డి సినిమా ప్రభావం  గీతగోవిందం సినిమా మీద పడి ఫలితంగా సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే ఒకవేళ గీతగోవిందం మూవీ నేను చేసి ఉంటే కచ్చితంగా ప్లాఫ్ అయ్యేది. ఎందుకంటే గీతగోవిందం కంటే నేను ముందు చేసిన సినిమాలు ఏవి కూడా అంతగా హిట్ కాలేదు.దాంతో ఆ ప్లాఫ్ సినిమాల ప్రభావం గీతగోవిందం సినిమా పై పడి కచ్చితంగా డిజాస్టర్ అయ్యేది.

ఒక మంచి సినిమా నేను చేసి ఉంటే డిజాస్టర్ అయ్యేది.నేను ఈ సినిమాలో చేయకపోవడమే మంచిది అయింది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో చేసి హిట్ కొట్టారు. అలాగే గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా నటించారు.నేను ఆయనలా నటించే వాడిని కాకపోవచ్చు  అంటూ నారా రోహిత్ చెప్పుకొచ్చారు. అలా నారా రోహిత్ గీతగోవిందం సినిమాని మిస్ చేసుకున్నాను అని తన నోటితో తానే ఒప్పుకున్నాడు. ఇక నారా రోహిత్,బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ లు నటించిన భైరవం మూవీ మే 30  న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఈ ముగ్గురు హీరోలకి మంచి పేరు అయితే వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: