- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ బిజెపి కొత్త అధ్యక్షుడిగా కేంద్ర జాతీయ నాయకత్వం ఎవరిని ఎంపిక చేస్తుంది ? అనే ఉత్కంఠ గత ఐదారు రోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాలలో విస్తృతంగా చర్చకి వచ్చింది. అయితే దీనికి ఎట్టకేలకు ఈరోజు తెరపడింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారు అయింది. ఈ మేరకు నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం ఆయనను ఆదేశించింది. మధ్యాహ్నం రెండు గంటలకు రామచంద్రరావు ఒకరే నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో ఆయన తెలంగాణ బిజెపి శాఖ కొత్త అధ్యక్షుడిగా ఎంపిక కానున్నారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న ? విషయంపై బీజేపీ అగ్రనేతుల తీవ్ర క‌స‌ర‌త్తులు చేశారు. ఎంపీలు ఈటెల రాజేందర్ - ధర్మపురి అరవింద్ - కే లక్ష్మణ్ - మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపించాయి. బీసీ కోటాలో ఈటెల రాజేందర్ తనకు కచ్చితంగా తెలంగాణ బిజెపి పగ్గాలు వస్తాయని నమ్మకంతో ఉన్నారు.


అయితే ఆర్ఎస్ఎస్ ఇక్కడ చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామచంద్రరావు పేరును ఖరారు చేశారు. ఆర్ఎస్ఎస్ తో పాటు కొందరు సీనియర్ నేతలు రామచంద్ర రావు పేరును బలంగా ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈట‌ల‌ రాజేందర్ బి.ఆర్.ఎస్ నుంచి బిజెపిలోకి రావడంతో ఆయనకు తెలంగాణ బిజెపి పగ్గాలు ఇచ్చేందుకు కొందరు సుముఖత వ్యక్తం చేయనట్టు తెలిసింది. ఇక అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవటం , పార్టీని బలోపేతం చేయటం , స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలు కొత్త అధ్యక్షుడు ఎంపికలో పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: