
ఇంకా సినిమా టైటిల్ పైన అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. కానీ గత రెండు మూడు రోజుల నుంచి నాగార్జునకు జోడిగా ఇందులో సీనియర్ హీరోయిన్ టబు నటించబోతున్నట్లు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇందులో పాత్రను టబు రిజెక్ట్ చేసిందని తన ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్లుగా వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు మరొక హీరోయిన్ కోసం చిత్ర బృందం సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. అందుకోసం గతంలో నాగార్జునతో కలిసి బాస్, గ్రీకు వీరుడు తదితర చిత్రాల విడుదలయ్యాయి. ఇప్పుడు తిరిగి మళ్లీ ఇమెను నాగార్జునకు జోడిగా తీసుకొనేలా చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం నయనతార కూడా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించడానికి ఇమె సుమారుగా రూ .15 నుంచి రూ.18 కోట్ల రూపాయల వరకు ఛార్జ్ చేస్తోంది. మరి అంత రెమ్యూనరేషన్ ఇచ్చి మరి నాగార్జున సినిమాలో నయనతారను తీసుకుంటారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతమైతే ఈ విషయం మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. కూలి సినిమాలో నాగార్జున కీలకమైన పాత్రలో నటించిన ఈ పాత్ర అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే ఇప్పుడు తన 100 వ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు.