
గతంలో బాలకృష్ణపై నాగబాబు పలు సార్లు తెగబడ్డారు. కొన్ని సందర్భాల్లో నేరుగా పేరుపేరునా విమర్శలు చేశారు. ఆ వీడియోలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం, మరోవైపు తన ఎమ్మెల్సీ స్థానం… ఈ రెండు అంశాలు నాగబాబు పబ్లిక్‌గా స్పందించకుండా వెనక్కి తగ్గేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా నాగబాబుకి తెలిసే జరిగిందట. ఆ సమయంలో కూడా ఆయన మాట్లాడకపోవడం ఫ్యాన్స్‌కు కాస్త షాక్ ఇచ్చింది. బాలయ్య వ్యాఖ్యల తర్వాత చిరంజీవి ఒక సాధారణ ప్రకటనతో సైలెంట్ అయ్యారు. కానీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో బాలయ్యపై దూకుడుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ నాగబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ మాత్రం ఆ అంశంపై ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
విదేశాల నుంచి చిరంజీవి వచ్చిన తర్వాత నాగబాబు భేటీ అయిన సందర్భంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో చిరంజీవి ఆ విషయాన్ని వదిలేయాలని నాగబాబుకు సూచించారట. అందుకే నాగబాబు బాహ్యంగా ఎలాంటి స్పందన ఇవ్వకపోయినా, సన్నిహితుల దగ్గర తన ఆగ్రహాన్ని ప్రస్తావిస్తున్నారని చెబుతున్నారు. జనసేన ఇప్పుడు అధికార కూటమిలో భాగం కావడంతో, పెద్ద స్థాయిలో వివాదం రాకుండా నాగబాబు మౌనం పాటిస్తున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే మెగా అభిమానులు మాత్రం ఆయన బహిరంగంగా స్పందించాలనే డిమాండ్ చేస్తున్నారు. చిరంజీవిపై బాలయ్య చేసిన వ్యాఖ్యలు మరిచిపోలేకపోతున్న నాగబాబు – తన సమయానికి రియాక్షన్ ఇస్తారో లేదో చూడాలి. ఈ మౌనం వెనుక రాజకీయ లెక్కలు ఎంత బలంగా ఉన్నాయో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.