తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం చేవెళ్ల మండల పరిధిలో మీర్జాపూర్ దగ్గర ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ను కంకర టిప్పర్ లోడుతో ఎదురుగా వచ్చి ఢీ కొట్టడంతో ఏకంగా 24 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సు ముందరవైపు మొత్తం నుజ్జునుజు అవ్వగా కంకర మొత్తం ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికుల మీద పడిపోయింది. ఈ ఘటనలో బస్సు లారీ డ్రైవర్ తో సహా చాలామంది ప్రయాణికులు స్పాట్లోనే మరణించారు.


ఈ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ .5 లక్షల రూపాయల, క్షతగాత్రులకు రూ .2 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అయితే ఇందులో మరణించిన వారిలో వికారాబాద్ జిల్లా తాండూరులో గాంధీనగర్ కు చెందిన ఎల్లమ్మ గౌడ్ ముగ్గురు కుమార్తెలు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. తనుషా, నందిని, సాయి ప్రియ మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు  తెలియజేశారు. గత నెల 17వ తేదీన ఒక పెళ్లి వేడుకలో సందర్భంగా చాలా ఆనందంగా గడిపిన అక్క చెల్లెలు ముగ్గురు ఈరోజున విగత జీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే ఈ ముగ్గురు హైదరాబాదులోని కోఠి మహిళా కళాశాలలో చదువుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరి స్నేహితులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.



ఈ ప్రమాదం  పైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని రాజకీయాలు చేయడం సరైనది కాదని, టిప్పర్ ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సు ను ఢీ కొంటే బస్సు దే తప్పా ? అంటూ ప్రశ్నించారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత ఒక్కో మృతదేహానికి ఒక్కో అధికారిని కేటాయిస్తామని వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే బాధ్యత అందిస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: