ప్రస్తుత కాలంలో  మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట  వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే  అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు.. నలుగురిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్త..!


దీని వివరణ ఏమిటంటే.. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలను కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే చెడు ఆలోచనల బాట పట్టకుండా ఉండగలుగుతారు . ఇక నలుగురిలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ నలుగురిలో ఉన్నప్పుడు నోరుజారి ఏదైనా అనరాని మాట అన్నామంటే ఇక అంతే.. ఎప్పటి నుంచో మంచిగా ఉన్న వ్యక్తులు కూడా కేవలం ఒక చిన్నమాటతో చెడ్డ వారి గా మారిపోవడం ఖాయం.. మనం మాట్లాడే మాటల వల్ల కూడా  ఇతరులు బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి..


ఉదాహరణకు మనం ఒంటరిగా ఉన్నప్పుడు సామాన్యంగా మంచి ఆలోచనలు రావనే చెప్పవచ్చు.. ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా మన స్వార్థం కోసం, మనమే, మన కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. ఇతరుల కోసం ఆలోచించడం మానేస్తాము. మన మనసు ఏది చెబుతుందో,  మన మెదడు కూడా అదే వినడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలను తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే అనర్థాలు జరుగుతాయి. ఇక నలుగురిలో ఉన్నప్పుడు కూడా మన మాటలు జాగ్రత్తగా ఉంటే,ఎవరికీ ఎలాంటి నష్టం జరగదు..


చూశారు కదా ఫ్రెండ్ ఇకనైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించడం తక్కువ చేసుకోండి.. అలాగే నలుగురిలో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాటలు మాట్లాడటం నేర్చుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: