ఒకనాడు ఒక తెల్ల ఏనుగు ఆహారం కోసం వెళ్లినప్పుడు దానికి ఒక మానవుడి ఏడుపు వినిపించింది. ఆ తెల్ల ఏనుగు అయ్యో ఎవరో మనిషి ఏడుస్తున్నాడు..అతని వద్దకు వెళ్ళి అతని దుఃఖానికి గల కారణం ఏమిటో తెలుసుకుందాం..అని.. ఆ మనిషి వద్దకు వెళ్లి కారణం అడిగింది. అప్పుడు ఆ మానవుడు "నేను ఈ అడవిలో దారి తప్పి ఇటుగా వచ్చాను. మూడు రోజులుగా తిరుగుతూ ఉన్నాను..కానీ నేను వెళ్లాల్సిన దారి మాత్రం తెలియటం లేదు"అన్నాడు ..

అప్పుడు ఏనుగు ఆ మనిషికి అడవి చివరన ఉన్న అతని గ్రామం వరకూ దారి చూపించింది. ఆ మనిషి ఎంతో సంతోషంగా ఊరికి వెళ్లగా , అక్కడ రాజభటుడు ఆ ఊరిలో ఉన్న ప్రజలందరితో ఇలా వివరిస్తున్నారు.  "రాజు గారి ఏనుగు మరణించింది. ఒక అపురూపమైన, రాజుగారికి యోగ్యమయ్యే ఏనుగును ఎవరు చూపిస్తారో వాళ్లకు బహుమతి ఇవ్వబడుతుంది" అని ప్రకటించడం ఆ మనిషి విన్నాడు. తెల్ల ఏనుగు జాడ తెలుసుకున్నాడు. కాబట్టి బహుమతికి ఆశపడి, రాజభటులకు సమాచారం అందించాడు.


వారు ఆ తెల్ల ఏనుగును వలవేసి పట్టారు. రాజధాని నగరానికి తెచ్చారు. ఆ ఏనుగుకు ఎంతో మర్యాద కూడా చేశారు. పుష్పాలతో అలంకరించారు. రాజ భక్షలు పెట్టారు. కానీ ఆ తెల్ల ఏనుగు ఒక్క దానిని కూడా ముట్టుకోలేదు. తన గుడ్డి తల్లిని ఎవరు చూసుకుంటారు? అని బాధపడింది. 'ఏనుగు ఏమీ తినటం లేదు'అనే సమాచారం రాజుగారికి అందింది. రాజుగారే స్వయంగా వచ్చి ఏనుగులు పలకరించారు. అప్పుడు ఏనుగు "నాకు ఈ రాజభోగాలు వద్దు, అడవిలో నా తల్లి ఉంది. నా తల్లిని చూసుకోవటంలోనే నాకు సుఖం ఉంటుంది"అని చెప్పింది.

ఏనుగు మాటలు విని రాజుగారు కరిగిపోయారు. వెంటనే తెల్ల ఏనుగును మరల అడవికి పంపే ఏర్పాటు చేశారు. తెల్ల ఏనుగు తన తల్లికి సేవలు చేస్తూ హాయిగా అడవిలో ఉండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: