మన దేశంలో అధిక సంఖ్యలో పూజలు అందుకునే దేవుళ్లలో శివుడు ఒకరు. త్రిమూర్తులలో చివరి వాడైన శివుడు లింగ రూపంలో పూజలందుకుంటుకు న్నాడు. శివుడిని మాత్రమే ప్రత్యేకంగా పూజించే భక్తులను శైవులని అంటారు. ఆది దేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళా శంకరుడిగా శివుడు పూజలు అందుకుంటున్నాడు. శివుడిని పూజించే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు.
 
భక్తులు కోరిన కోరికలను తీర్చే దేవుడిగా శివుడికి పేరుంది. పరమేశ్వరుని పూజించే సమయం మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం బదులు ఆగ్రహం పొందాల్సి రావచ్చు. శివపూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా రాగి లేదా వెండి లేదా బంగారం చెంబులలో నీళ్లను ఉంచాలి. ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తరువతాతే మనం పూజలను మొదలుపెట్టాలి.
 
పరమేశ్వరునికి పాలు, పళ్లు, ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం. పరమేశ్వరుడు ఎల్లవేళలా తపస్సు, పూజలో ఉంటాడని మన పూర్వీకులు, పెద్దలు చెబుతూ ఉంటారు. తపస్సు చేసే శివుని ఎల్లప్పుడూ గంధమే రాయాలి. శివుడికి గంధం బదులు వేడినిచ్చే కుంకుమ సమర్పిస్తే మంచి ఫలితాలను పొందలేమని పురాణాలు చెబుతున్నాయి. శివునికి బిల్వ పత్రాలు అంటే ఎంతో ఇష్టం. కానీ సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజులలో బిల్వ పత్రాలను కోయకూడదు.
 
శివలింగంపై కొబ్బరి నీళ్లను ఎప్పుడూ వేయకూడదు. శివుడికి పూజ చేసే ముందు గణపతిని పూజించడం లేదా స్మరించడం మంచిది. శివునికి ఇతర పండ్లతో పోలిస్తే వెలగపండు ప్రీతికరమైంది. వెలగపండు ఇచ్చి పూజిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుంది. శివునికి సంపంగి పూలను సమర్పించకూడదు. ఇంట్లో మనం శివలింగం పెట్టుకుంటే జలధార కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. శుభ్రంగా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత శివునికి పూజ మొదలుపెట్టాలి. పూజలు చేసే సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది.

మరింత సమాచారం తెలుసుకోండి: