బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముగిసాక భారత్ వెస్టిండిస్ తో పోరుకు సిద్ధమైంది. బంగ్లాతో టెస్ట్ సిరీస్ గెలిచి జోష్ మీదున్న భారత జట్టు వెస్టిండీస్ తో కూడా సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా రోహిత్ శర్మ లాంటి హిట్టర్లతో భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. అయితే భారత జట్టును ఢీ కొనడానికి వెస్టిండీస్ జట్టు ఎలా ఉందనేది చూస్తే చాలా దయనీయంగా ఉందని అర్థం అవుతుంది.  వెస్టిండీస్ జట్టు దాదాపు ఐదేళ్ళ విరామం తర్వాత ఒక సిరీస్ ని గెలుచుకోగలిగింది.

 

ఆప్ఘనిస్తాన్ తో జరిగిన వన్డే సిరీస్ లో విజయం సాధించినప్పటికీ తిరిగి టీ ట్వంటీ ఫార్మాట్ లో ఓడిపోయింది. టీ ట్వంటీ ఫార్మాట్ లో విశ్వ విజేతగా గెలిచిన ఈ టీమ్ పరిస్థితి ఇలా కావడం నిజంగా ఆశ్చర్యమే. అయితే భారత్ తో ఆడే వెస్టిండీస్ జట్టు ఏ విధమైన బలాలని కలిగి ఉందో చూద్దాం. మొదటగా సీనియర్ ఆటగాడయిన పోలార్డ్ ఈ జట్టుకి నాయకత్వం వహిస్తున్నాడు. అయితే కెప్టెన్ గా పొలార్డ్ కి అంత అనుభవం లేదు.

 

ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచులకి మాత్రమే అతను కెప్టెన్ గా వ్యవహరించాడు. కానీ ప్రస్తుతం ఉన్న జట్టులో అతడొక్కడే సీనియర్ ఆటగాడు. క్రిస్‌ గేల్, ఆండ్రీ రసెల్, డ్వేన్‌ బ్రేవో, సునీల్‌ నరైన్‌లాంటి భారత అభిమానులు గుర్తించే ఆటగాళ్లెవరూ ఇప్పుడు జట్టులో లేరు. ప్రస్తుతం ఉన్న వారందరూ కొత్త వారవడం వారి పాలిట శాపం కానుంది. అదీ గాక విండీస్ ఆటగాళ్లలో ఎక్కువ భాగం కరీబియన్ ప్రీమియర్ లిగ్ నుండి వచ్చిన వారే

 

ఆ ఆటగాళ్ల ప్రదర్శ్న అంతర్జాతీయ స్థాయిలో ఉండదనేది అందరికీ తెలుసు. ఇంకా స్పిన్నర్లు కూడా అనుభవజ్ఞులు లేకపోవడం విండీస్ కి నష్టం చేకూరుస్తుంది. హేడెన్‌ వాల్ష్కు, పైర్ లాంటి అనుభవం లేని స్పిన్నర్లని ఎదుర్కోవడం భారత ఆటగాళ్లకి చాలా తేలిక. ఆటగాళ్ల పరంగా పటిష్టంగా ఉన్న భారత జట్టును విండీస్ ఎలా ఢీ కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: