
ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో బాగా రాణిస్తున్న ఆటగాళ్ల పేర్లు మారుమోగిపోతున్నాయని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా కొనసాగుతున్న డూప్లెసెస్ మెరుపు ఇన్నింగ్స్ ఇప్పుడు వార్తలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో జోహార్ నెస్ సూపర్ కింగ్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు డూప్లెసిస్. ఇటీవల జరిగిన మ్యాచ్ లో 58 బంతుల్లో 113 పరుగులు చేసి అదిరిపోయే సెంచరీ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 8 సిక్సర్లు ఉండడం గమనార్హం.
సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో డూప్లిసెస్ తొలి శతకం ఇదే కావడం గమనార్హం. మొత్తంగా ఏడు మ్యాచ్లలో కలిపి 227 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో బాటలర్ 285 పరుగులతో పర్ల్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ టాప్ లో ఉన్నాడు స్టోక్స్. ఇటీవల డార్బన్ సూపర్ జెయింట్స్, జోహెన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన జోహార్ నెస్ సూపర్ కింగ్స్ డూప్లెసెస్ దాటికీ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని చేదించింది. అయితే డూప్లెసిస్ అద్భుతంగా గమనించడంతో ఐపీఎల్లో కూడా ఇదే విధ్వంసాన్ని కొనసాగిస్తాడని బెంగళూరు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.