
ఈ క్రమంలోనే 2022 ఏడాదిలో అద్భుతమైన ఫామ్ కనపరిచిన టీమ్ ఇండియా బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. దీంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం మాజీ ఆటగాళ్ళు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఇటీవల భారత మహిళా క్రికెటర్ కూడా ఇలాంటి ఒక అరుదైన ఐసీసీ అవార్డును దక్కించుకొని భారత క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది అని చెప్పాలి.
ఉమెన్స్ టీమ్ ఇండియా జట్టులో ప్రస్తుతం కీలకమైన బౌలర్గా కొనసాగుతున్న ఫేసర్ రేణుక సింగ్.. ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో భాగంగా ఉమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. ఈ క్రమంలోనే చరిత్ర సృష్టించింది. ఇలాంటి అరుదైన అవార్డును గెలుచుకున్న తొలి భారత మహిళా క్రికెటర్గా నిలిచింది. 26 ఏళ్ల రేణుక సింగ్ 2022లో అన్ని ఫార్మాట్లలో కలిపి 40 వికెట్లు పడగొట్టింది. ఈ క్రమంలోనే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కోసం నామినేట్ అయ్యి చివరికి అవార్డు గెలుచుకుంది. ఇక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆస్ట్రేలియా ప్లేయర్ మెక్ గ్రాత్ గెలుచుకోవడం గమనార్హం .