దేశవాళి క్రికెట్లో భారీగా పరుగులు చేస్తూ ప్రస్తుతం టీమిండియాలోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్న ఆటగాళ్ళలో మొదటి వరుసలో ఉన్నాడు సర్ఫరాజ్ ఖాన్. దాదాపు గత రెండు మూడు ఏళ్ల నుంచి కూడా దేశ వాలి క్రికెట్లో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా తో జరగబోయే టెస్ట్ సిరీస్లో అతనికి భారత జట్టు నుంచి పిలుపు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన రీతిలో అతని పక్కన పెట్టేసింది బిసిసిఐ సెలెక్షన్ కమిటీ. అదే సమయంలోసూర్య కుమార్ యాదవ్కు అవకాశం కల్పించింది అన్న విషయం తెలిసిందే. అయితే సర్ఫరాజ్ ఖాన్ కాస్త లావుగా ఉన్నాడు అనే కారణంతోనే అతన్ని పక్కన పెట్టారు అనే విమర్శలు వచ్చాయి.


 అయితే నాజూగ్గా ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి అనుకుంటే ఫ్యాషన్ షోలకు వెళ్ళండి అంటూ మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ సెలెక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఇలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన బీసీసీఐ సెలెక్టర్.. సర్ఫరాజ్ ఖాన్ మా దృష్టిలోనే ఉన్నాడని సమయం వచ్చినప్పుడు అతనికి తప్పకుండా భారత జట్టులో చోటు కల్పిస్తాము అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమిండియా సీనియర్ స్పిన్నర్  రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన ఫాంపై ప్రశంసలు కురిపించాడు.


 సర్ఫరాజ్ ఖాన్ గురించి చెప్పడానికి ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి అన్న విషయం కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికే అతను జట్టులోకి వస్తాడా లేదా అన్న విషయంపై చర్చ జరిగింది. అయితే అతడేమీ సెలక్షన్ గురించి పట్టించుకోవడం లేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు. 2019 -20 దేశవాళీ  సీజన్లో 900 పరుగులు, 2020-21 లో 1000 పరుగులు ఇక ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పటికే 600 చేశాడు. ఇక తన ప్రదర్శనతో తన ఉద్దేశం ఏంటో ఇప్పటికే చాటి చెప్పాడు. కేవలం సెలక్షన్ కమిటీ తలుపులను మాత్రమే తన ప్రదర్శనతో బాదలేదు అందులోని సభ్యులను కూడా దహించి వేసేలా ప్రదర్శన చేశాడు. దురదృష్టవశాత్తు అతడు ఎంపిక కాలేకపోయాడు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: