ఇటీవల కాలంలో ఎంతోమంది భారత మహిళా క్రికెటర్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో ప్రపంచ రికార్డులు కొల్లగొట్టడంలో కూడా దూసుకుపోతున్నారు అని చెప్పాలి. పురుషుల క్రికెట్కు తాము ఎక్కడ తక్కువ కాదు అనే విధంగానే ప్రదర్శన చేస్తూ ఇక వరుసగా విజయాలు అందుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల భారత ఉమెన్స్ అండర్ 19 జట్టు ఇటీవల ప్రపంచ కప్ గెలిచి ఏకంగా హిస్టరీ క్రియేట్ చేసింది అన్న విషయం తెలిసిందే.


 ఇలా హిస్టరీ క్రియేట్ చేసిన భారత యువ క్రికెటర్లు అందరినీ కూడా ఎంతో ఘనంగా సత్కరించింది బీసీసీఐ. భారీ నజరానా కూడా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా గత కొంతకాలం నుంచి భారత క్రికెట్లో తన బౌలింగ్ తో ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది దీప్తి శర్మ. గతంలో ఇక మన్ కడింగ్ అనే వివాదంలో కూడా చిక్కుకొని హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ విషయంలోనే ఎంతోమంది దీప్తి శర్మ పై విమర్శలు గుప్పించారు.మరి కొంతమంది ఆమె చేసింది కరెక్టే అంటూ మద్దతు పలికారు అని చెప్పాలి.


 ఇకపోతే ప్రస్తుతం ఐసీసీ ప్రకటించే టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకునేందుకు దీప్తి శర్మ కేవలం ఒక్క అడుగు దూరంలో ఉంది అన్నది తెలుస్తుంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోనపు టి20 టోర్నీలో దీప్తి తొమ్మిది వికెట్లు పడగొట్టింది. అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ప్లేయర్ సోఫీ అకిల్ స్టోన్ దీప్తికి కేవలం 26 పాయింట్ల వ్యత్యాసమే ఉండడం గమనార్హం. అయితే దక్షిణాఫ్రికాతో జరిగితే ఫైనల్ లో భారత్ స్పిన్నర్ జోరు కొనసాగిస్తే మాత్రం ఇక్కడ టాప్ ర్యాంక్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. టాప్ టెన్ లో మరో ఇద్దరు భారత బౌలర్లు రేణుక, స్నేహ్ రానా కూడా ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: