
ఈ క్రమంలోనే ఇక ప్రస్తుత క్రికెటర్లు గాని లేదా ఒకప్పుడు క్రికెట్లో ఎంతగానో సేవలు అందించి ప్రస్తుతం మాజీ క్రికెటర్లుగా మారిన వారు ఎవరైనా సరే ఇక ఏదైనా వివాదంలో చిక్కుకున్నారు అంటే చివరికి ఆ వార్త హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. కాగా టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీకి సంబంధించిన ఒక వార్త కూడా ప్రస్తుతం ఇలాగే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏకంగా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. అయితే అతనిపై కేసు పెట్టింది ఎవరో కాదు అతను పెళ్లి చేసుకున్న భార్య కావడం గమనార్హం .
వినోద్ కాంబ్లీ తనపై దాడి చేశాడు అంటూ అతని భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను బూతులు తిట్టడంతో పాటు దాడికి పాల్పడినట్లు వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా ఫిర్యాదు చేయగా ఇక ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అని చెప్పాలి. ఇటీవలే మద్యం మత్తులో కుకింగ్ పాన్ తనపై విసిరాడని.. ఈ క్రమంలోనే తనకు గాయం అయింది అంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఇకపోతే ప్రస్తుతం ఆండ్రియా గాయం నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఇంకా వినోద్ కాంబ్లీని అదుపులోకి తీసుకోలేదు అన్నది తెలుస్తుంది.