
ఈ క్రమంలోనే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగబోతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా ఎవరు ఎలాంటి ప్రదర్శన చేస్తారో అన్న దానిపైనే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఇక రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తున్నారు. విజయం ఎవరిది అనే విషయంపై అటు అభిమానులు కూడా కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు అని చెప్పాలి. అయితే టీమిండియా స్పిన్నర్లు అటు ఆస్ట్రేలియా జట్టును ముప్పు తిప్పలు పెట్టడం కాయమని కొంతమంది అభిప్రాయపడుతుంటే ఇక ఆస్ట్రేలియా స్పిన్నర్లు బాగా రాణిస్తారని మరి కొంతమంది రివ్యూ ఇస్తున్నారు.
ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాథన్ లయన్ లాంటి స్టార్ బౌలర్లు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు టీమిండియా భయపడే ప్రసక్తే లేదు అంటూ అభిప్రాయపడ్డాడు మిచెల్ జాన్సన్ అయితే భారత్ పై ఒత్తిడి పెంచేందుకు ఆస్ట్రేలియాకు ఒకే ఒక్క మార్గం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రతి మ్యాచ్లో కుదిరినప్పుడల్లా మొదటి బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసి ఇక భారత జట్టుపై ఒత్తిడి పెంచేందుకు అవకాశం ఉంది అంటూ తెలిపాడు మీచెల్ జాన్సన్. కాగా ఆస్ట్రేలియా భారత్ మధ్య మొదటి మ్యాచ్ నాగ్ పూర్ వేదికగా ఫిబ్రవరి 9వ తేదీన ప్రారంభం కాబోతోంది.