
విరాట్ కోహ్లీ సెంచరీ చేయక దాదాపు మూడేళ్లు గడిచిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు కోహ్లీ బ్యాట్ నుంచి ఒక సాలిడ్ సెంచరీ వస్తుందని అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో భారత జట్టు ఆస్ట్రేలియాలతో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో కోహ్లీ ప్రదర్శన పై అభిమానంతో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే కోహ్లీ అటు ఆస్ట్రేలియా బౌలర్ తో చెడుగుడు ఆడటం ఖాయమని ఎంతమంది భారత మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలీ.
ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నిలదొక్కుకుంటే ఈ సిరీస్ మొత్తం ఆస్ట్రేలియా ను ముప్పు తిప్పలు పెడతాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాకు విరాట్ కోహ్లీ ఒక ముల్లుగా మారిపోయాడని.. అతనికి ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. ఐదో స్థానంలో ఐదవ మంచి బ్యాట్స్మెన్ ను పెట్టాలి అంటూ సూచించాడు మాజీ కోసే రవి శాస్త్రి. ఇకపోతే కోహ్లీని అవుట్ చేసేందుకు అటు ఆస్ట్రేలియా కూడా ప్రత్యేకమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది.