బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే చాలు ఇక క్రికెట్ హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ చూపు కూడా ఇక ఈ దేశీయ లీగ్ పైనే ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది బీసీసీఐ.  ఇప్పటికే మినీ వేలం ప్రక్రియను కూడా పూర్తి చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎంతోమంది ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరో జట్టుకు మారిపోయారు. అంతేకాదు కొన్ని జట్లకు కెప్టెన్లుగా ఉన్న ఆటగాళ్లు కూడా మరో జట్టుకు వెళ్ళిపోయారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనె ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది కూడా అటు ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంది అని చెప్పాలి. అయితే ఐపీఎల్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది ఐపిఎల్ సీజన్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. కానీ ఈ ఏడాది మాత్రం టైటిల్ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే  వేలం సమయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఇక కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని టీంను పటిష్టంగా మార్చుకుంది.



 ఇక ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ కొట్టడం ఖాయమని అభిమానులు నమ్మకం పెట్టుకుంటూన్న వేళ.. ఇక ఇటీవల ఈ ఛాంపియన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే న్యూజిలాండ్ కు చెందిన బౌలర్ కైల్ జేమ్సన్ చెన్నై జట్టుకు దూరం కాబోతున్నాడట. వెన్నునొప్పి గాయం కారణంగా ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ కి అతను దూరమయ్యాడు. ఇక ఈ సీజన్ ఐపీఎల్లో కూడా ఆడటం కష్టమే అనేది తెలుస్తుంది. దీంతో అతని స్థానంలో ఇక సిఎస్కే మరొకరి కోసం వేట ప్రారంభించినట్లు ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl