
అయితే ఇక ప్రస్తుతం ఉన్న స్టార్ క్రికెటర్లతో పోల్చి చూస్తే ధోనికే ఎక్కువ క్రేజ్ ఉంది అన్న విషయం ఎన్నోసార్లు నిరూపితం కూడా అయింది. అయితే అందరిలాగా ధోని సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడు. అయినప్పటికీ ధోనీకి సంబంధించిన ఏదో ఒక పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అని చెప్పాలి. ఇక ధోనికి సంబంధించిన కొత్త లుక్ ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది అభిమానుల దృష్టిని తెగ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి ఫోటోనే ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
భారత ఆర్మీ దుస్తుల్లో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే గౌరవ లెఫ్ట్నెంట్ కల్నల్ హోదాలో ఉన్నాడు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. ఇక ఇటీవల జోద్పూర్ లోని ఆర్మీ క్యాంప్ ని సందర్శించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని అక్కడ సైనికులతో కాసేపు సరదాగా మాట్లాడారు మహేంద్రసింగ్ ధోని. అయితే తమ అభిమాన క్రికెటర్ ఇలా ఆర్మీ దుస్తువుల్లో కనిపించడంతో ఈ ఫోటోలు చూసి అభిమానులు అందరూ కూడా తెగ మురిసిపోతున్నారు అని చెప్పాలి.