
ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ అటు ఆ జట్టులో సమిష్టి ప్రదర్శనలు లేకపోవడమే వైఫల్యానికి కారణంగా మారిపోతుంది. విరాట్ కోహ్లీ మినహా మరే ఇతర బ్యాట్స్మెన్ కూడా బెంగళూరు టీం లో సత్తా చాటలేదు. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి బెంగళూరుకు ఆడుతున్న కోహ్లీ ఏకంగా ఇప్పటివరకు 7000 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ తర్వాత బెంగళూరులో కనీసం 1000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కూడా ఎవరూ లేరు అని చెప్పాలి. ఇతర ఫ్రాంచైజీల తరపున వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ళు బెంగళూరు జట్టు తరుపున మాత్రం ఇప్పటివరకు వేయి పరుగులు సాధించలేదు.
ఐపీఎల్ అరంగేట్ర సీజన్ నుంచి బెంగళూరు జట్టుకు రాహుల్ ద్రవిడ్, పార్థివ్ పటేల్, రాబిన్ ఉత్తప్ప, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, దినేష్ కార్తీక్, పడిక్కాల్, కేదార్ జాదవ్ లాంటి ఎంతో మంది ప్లేయర్లు ఆడారు. కానీ ఒకరు కూడా బెంగళూరు తరఫున వెయ్యి పరుగులు చేయలేదు. ద్రవిడ్ బెంగళూరు తరఫున 898 పరుగులు చేయగా.. కోహ్లీ తర్వాత ఇది అత్యధికంగా ఉంది. పడిక్కాల్ 884, పార్థివ్ పటేల్ 731, దినేష్ కార్తీక్ 611, మన్దీప్ సింగ్ 597, సౌరబ్ తివారి 487, మయాంక్ అగర్వాల్ 433, మనీష్ పాండే 417 పరుగులతో తర్వాత స్థానంలో ఉన్నారు.