టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకప్పుడు డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ లో ఉండే దూకుడుని ఇప్పటికీ క్రికెట్ ప్రేక్షకులు మర్చిపోరు. కేవలం బ్యాటింగ్లో మాత్రమే కాదు తన మాటల్లో కూడా అంతే దూకుడు చూపిస్తూ ఉంటాడు వీరేంద్ర సెహ్వాగ్. తన ముందు ఉన్నది ఎంతటి వారైనా సరే ఇక తన మనసులో ఉన్నది ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు క్రికెట్ కి దూరమైనా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటున్నాడు. ఇక ఎప్పుడూ ఆటగాళ్ల ప్రదర్శన గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తెగ రివ్యూలు ఇస్తున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇక ఇటీవలే భారత యంగ్ క్రికెటర్లు ఇద్దరినీ టార్గెట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న శుభమన్ గిల్ తో పాటు ఇటీవల ఫామ్ లోకి వచ్చిన పృథ్వి షాపై కూడా మండిపడ్డాడు వీరేంద్ర సెహ్వాగ్. ఈ ఏడాది ఐపీఎల్ లో పృథ్వి షా చెత్త ఫాం కనబరిచాడు. ఆరు మ్యాచ్లలో చాలా పేలవంగా బ్యాటింగ్ చేశాడు. ఇటీవలే పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం పృథ్వి షా హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. అయితే ఇలా హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పృథ్వి షా చేసుకున్న సెలబ్రేషన్స్ మాత్రం కాస్త అందరికీ చిరాకు తెప్పించాయి.


 ఇక ఇటీవల ఇదే విషయంపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ పృథ్వి షా నాతో కలిసి ఒక యాడ్ చేశాడు. అప్పుడు శుభమన్ గిల్ కూడా మాతో ఉన్నాడు. మేము అక్కడ ఆరు గంటలు కలిసి ఉన్నాం. కానీ వాళ్ళిద్దరితో ఎవరు కూడా నాకు క్రికెట్ గురించి ఏం మాట్లాడలేదు. మనం ఎవరితో అయినా మాట్లాడాలంటే మనమే వెళ్ళాలి. అంతేకానీ వాళ్లు వచ్చి మనతో మాట్లాడరు అంటూ ఇద్దరు కుర్ర క్రికెటర్లను విమర్శించాడు వీరేంద్ర సెహ్వాగ్. తను సునీల్ గవాస్కర్ ని కలిసినప్పుడు ఇక అతనితో మాట్లాడడానికి ఎంతో ఇష్టపడి ఆయన దగ్గరికి వెళ్లాను. కానీ గవాస్కర్ వచ్చి తనతో మాట్లాడే దాకా చూడలేదు అంటూ గుర్తు చేశాడు. ఇక ఇప్పుడు కుర్రాళ్ళు కూడా ఇలాగే ఉంటే మంచిదని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl